Kannada Language: కన్నడ భాషకు అవమానం.. వికారమైన భాషగా చూపిస్తున్న గూగుల్..

కన్నడ భాష విషయంలో గూగుల్ వ్యవహార శైలి విమర్శకు తావిస్తుంది. ఇండియాలో అత్యంత వికారమైన భాష ఏదని గూగుల్ లో సెర్చ్ చేస్తే కన్నడ అని చూపిస్తుంది. దీనిపై కన్నడ ప్రజలు మండిపడుతున్నారు.

Kannada Language: కన్నడ భాష విషయంలో గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ విమర్శకు తావిస్తుంది. ఇండియాలో అత్యంత వికారమైన భాష ఏదని గూగుల్ లో సెర్చ్ చేస్తే కన్నడ అని చూపిస్తుంది. దీనిపై కన్నడ ప్రజలు మండిపడుతున్నారు. ఒక్క కన్నడవారే కాదు దేశంలోని చాలామంది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.

దీనిపై పొలిటికల్ లీడర్స్ కూడా స్పందించారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఎంపీ పీసి మోహన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ విజయనగర సామ్రాజ్యానికి నిలయం, విలువైన వారసత్వ సంపద కన్నడ భాష. కన్నడ భాషకు ప్రత్యేకమైన సంస్కృతి ఉందని అన్నారు. ప్రపంచంలో ఉన్న అతిపురాతన భాషల్లో కన్నడ కుడా ఒకటని తెలిపారు.

జాఫ్రీ చౌసెర్ పుట్టకముందే కన్నడలో పురాణాలు ఉన్నాయన్నారు. ఓ భాషను అవమానించడం తగదని వెంటనే గూగుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు పీసి మోహన్ . ఇక నెటిజన్లు ఎవరికీ తోచిన విదంగా వారు పోస్టులు పెడుతున్నారు. కొందరు కన్నడ కంటే మంచి భాషా ఎదో చెప్పండి అని ప్రశ్నిస్తే.. మరికొందరు గూగుల్ ను ఇండియాలో బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు