Vehicle Fitness Test Charges: వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. వాహనాల ఫిట్ నెస్ టెస్ట్ ఫీజులు భారీగా పెంచేసింది. వాహనాల ఫిట్‌నెస్ ఫీజుకు కేంద్రం మూడు (10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. పాత వాహనాలకు అంటే.. 20 ఏళ్లు పైబడిన వాటి ఫిట్ నెస్ టెస్ట్ ఫీజులను ఏకంగా 10 రెట్లు పెంచింది.
ఈ నిర్ణయంతో వాహనాల వయసు, కేటగిరీ బట్టి ఫీజుల్లో భారీ మార్పులు జరిగాయి. ట్రక్కులు/బస్సులకు రూ.25 వేలు, మీడియం కమర్షియల్ వాహనాల (MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల (LCV)కు రూ.15 వేలు, త్రీ వీలర్స్‌కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది.
ఫిట్‌నెస్ టెస్ట్ ఫీజులను పెంచుతూ కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్‌కు ఐదో సవరణ చేసింది. ఈ కొత్త నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయంది. ఇప్పటివరకు 15 ఏళ్లు పైబడిన వాహనాలకే ఎక్కువ ఫిట్‌నెస్ ఫీజులు ఉండేవి. తాజా సవరణల ప్రకారం ఈ వయోపరిమితిని పదేళ్లకు తగ్గించారు. అంటే, ఇకపై పదేళ్లు పూర్తి చేసుకున్న వాహనాలకు కూడా పెంచిన ఛార్జీలు వర్తిస్తాయి. అంతేకాదు వాహనాల వయసును బట్టి ఫీజుల విధానాన్ని కూడా మార్చారు. గతంలో 15 ఏళ్లు దాటిన అన్ని వాహనాలకు ఒకే ఫీజు ఉండగా, ఇప్పుడు మూడు విభాగాలుగా వర్గీకరించారు.
మూడు కేటగిరీలు ఇవే..
* 10-15 ఏళ్లు
* 15-20 ఏళ్లు
* 20 ఏళ్లకు పైబడినవి.
ఈ కొత్త విధానం టూ వీలర్స్, త్రీ వీలర్స్, లైట్ మోటార్ వెహికల్స్, మీడియం హెవీ కమర్షియల్ వెహికల్స్ కు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.
20ఏళ్లు పైబడిన వాహనాలకు పాత ఫీజు, కొత్త ఫీజు..
* హెవీ కమర్షియల్ వెహికల్స్ – రూ.2500 – రూ.25వేలు
* మీడియం కమర్షియల్ వెహికల్స్ – రూ.1800 – రూ.20వేలు
* లైట్ మోటర్ వెహికల్స్ – కొత్త ఫీజు 15వేలు
* త్రీ వీలర్స్ – కొత్త ఫీజు 7వేలు
* టూ వీలర్స్ – 600 – 2వేలు