Cable TV Network Rules : కేబుల్ టీవీ నిబంధనల సవరణ

బుల్ టీవీ నెట్ వర్క్ రూల్స్ ని కేంద్రప్రభుత్వం సవరించింది.

Govt Amends Cable Tv Network Rules

Cable TV Network Rules కేబుల్ టీవీ నెట్ వర్క్ రూల్స్ ని కేంద్రప్రభుత్వం సవరించింది. టీవీ చానళ్లలో ప్రసారమయ్యే కంటెంట్‌పై ప్రేక్షకుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ నిబంధనలు-1994ను సవరించినట్లు కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ గురువారం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రస్తుతం ప్రోగ్రామ్‌ లేదా ప్రకటనల కోడ్‌ ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి అంతర్‌ మంత్రిత్వ శాఖల కమిటీ ఉంది. అలాగే వివిధ ఛాన‌ళ్ల యాజ‌మాన్యాలు.. ఫిర్యాదుల పరిష్కారానికి సొంతంగా అంతర్గత స్వీయ నియంత్రణ విధానాలను కూడా అభివృద్ధి చేసుకున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా చట్టబద్ధమైన యంత్రాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించిన కేంద్ర ప్ర‌భుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

టెలివిజన్‌ ఛానల్స్‌ వీటిని పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల మరింత పారదర్శకతతో ప్రజలకు ప్రయోజనకం కలుగుతుందని పేర్కొంది. బ్రాడ్‌కాస్టర్ల సెల్ఫ్‌ రెగ్యులేటింగ్‌ సంస్థలు కేంద్ర ప్రభుత్వం వద్ద రిజిస్టర్‌ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లు వివరించింది. అంటే ఈ సంస్థలకు చట్టపరమైన గుర్తింపు ఉండాల్సిందే.