Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్రికులకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం గుడ్ న్యూస్..‘‘యాత్రి నివాస్‌’’ నిర్మాణం

అమర్‌నాథ్ యాత్రికులకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.20,000మంది భక్తుల కోసం ఓ నిర్మాణాన్ని చేపట్టింది.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర. పరమ శివుడ్రి మంచు లింగంలో చూడాలని ఎంతోమంది భక్తులు ఎన్నో వ్యయ ప్రయాలకు ఓర్చుకుని అమర్ నాథ్ యాత్రకు వెళుతుంటారు. మంచు కొండల్లో ఎంతో ప్రయాసపడి ఎట్టకేలకు ఆ పరమశివుడ్ని మంచులింగారంలో చూసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతుంటారు. అటువంటి అమర్ నాథ్ యాత్రీకుల కోసం జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

Also read : Bhanuprakash Reddy: హిందూ ఆధ్యాత్మిక పుస్తకాల ముద్రణ ఎందుకు సాగడం లేదు?: బీజేపీ నేత భానుప్రకాష్

అదేమంటే..దక్షిణ కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ ధామ్ వార్షిక తీర్థయాత్రకు వచ్చే భక్తుల కోసం జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 20 వేల మంది సామర్థ్యంతో ‘‘యాత్రి నివాస్‌’’ను నిర్మిస్తోంది. 2020– 2021 సంవత్సరాల్లో కోవిడ్-19 వల్ల ప్రపంచమే స్థంభించిపోయిన క్రమంలో అమర్ నాథ్ యాత్ర విషయంలో భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. కోవిడ్ గణనీయంగా తగ్గడంతో..ప్రభుత్వం దర్శనాలు, భక్తుల రాకపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. ఈక్రమంలో 2022 సంవత్సరంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

శ్రావణ మాసంలో (జులై – ఆగస్టు) అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న క్రమంలో ఈ యాత్రపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమీక్ష చేపట్టారు. భక్తుల రద్దీ పెరుగనున్న క్రమంలో తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అమర్‌నాథ్ క్షేత్రంలో రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించాలని నిర్ణయించారు. ఒకేసారి 20 వేల మంది బస చేసేందుకు వీలుగా భవనాన్ని నిర్మించాలని పాలనా యంత్రాంగం నిర్ణయించింది.

Also read : Peacocks Died: పంటపొలంలో విషం తిని 12 నెమళ్ళు మృతి.. రైతు అరెస్ట్

రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్‌లో అమర్‌నాథ్ క్షేత్రం బోర్డు ద్వారా మూడు వేల పడకల యాత్రి నివాస్‌ను నిర్మించామని తెలిపారు అధికారులు. యాత్రికుల భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది యాత్రంలో వాహనాలు, ప్రయాణికుల కదలికలను గుర్తించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(ఆర్ఎఫ్‌డీ)ని ఉపయోగించాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది.

ట్రెండింగ్ వార్తలు