Bhanuprakash Reddy: హిందూ ఆధ్యాత్మిక పుస్తకాల ముద్రణ ఎందుకు సాగడం లేదు?: బీజేపీ నేత భానుప్రకాష్

దేవాదాయశాఖ పరిధిలోని ధార్మిక సాహిత్యం, సాంప్రదాయాలు తెలిపే హిందూ ధర్మ పుస్తకాల ప్రచురణలు తగ్గుతూ.. అన్యమత పుస్తకాల ముద్రణ పెరిగిపోతుందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆందోళన

Bhanuprakash Reddy: హిందూ ఆధ్యాత్మిక పుస్తకాల ముద్రణ ఎందుకు సాగడం లేదు?: బీజేపీ నేత భానుప్రకాష్

Hindhu Books

Bhanuprakash Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాదాయశాఖ పరిధిలోని ధార్మిక సాహిత్యం, సాంప్రదాయాలు తెలిపే హిందూ ధర్మ పుస్తకాల ప్రచురణలు తగ్గుతూ.. అన్యమత పుస్తకాల ముద్రణ పెరిగిపోతుందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భాను ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఆయా దేవాలయాల్లో భగవంతుడికి సంబందించిన సాహిత్యాన్ని గతంలో పుస్తక రూపంలో భక్తులకు అందించేవారని.. ఇటీవల కాలంలో కరోనా పేరుతో ఆయా పుస్తకాల ముద్రణను నిలిపివేశారని భానుప్రకాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Also read: Colorful Holi : రంగుల హోలీలో…నిర్లక్ష్యం వద్దు…జాగ్రత్తలు తప్పనిసరి

శ్రీశైలం, సింహాచలం, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి క్షేత్రాలలో ఆధ్యాత్మిక పుస్తకాలు భక్తులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని.. ముఖ్యంగా తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారి వైభవం, తిరుమల కొండ విశిష్టతకు సంబందించిన పుస్తకాలు ఎక్కడా లభించడంలేదని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుమలలో లక్ష్మి కటాక్షం వున్నా….సరస్వతి బాండాగారం లేకుండా చేశారని టీటీడీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక విషయాలను వెబ్ సైట్ లో చూసి తెలుసుకోవాలంటూ టీటీడీ అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్న భాను ప్రకాష్ రెడ్డి..అట్టి సమాచారాన్ని వెబ్ సైట్ కే పరిమితం చెయ్యకూండా….పుస్తక ముద్రణ చెయ్యాలని డిమాండ్ చేశారు.

Also read: AP 10th Exams: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు వాయిదా

ఎండోమెంట్ అధికారులు, టీటీడీ అధికారులు వెంటనే స్పందించి..గతంలో లాగానే హిందూ ఆధ్యాత్మిక పుస్తకాల ముద్రణ కొనసాగించాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల సౌకర్యార్ధం పుస్తకాలు అందుబాటులో ఉంచడంతో పాటు..రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భగవంతుడికి సంబందించిన సాంప్రదాయ సాహిత్యాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని భాను ప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Also read: Justice NV Ramana: నేడు శ్రీశైలానికి సీజేఐ జస్టిస్ ఎన్‌.వి.రమణ రాక