AP 10th Exams: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు వాయిదా

ముందుగా మే 2 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ప్రకటించినా..ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అడ్డు తగలడంతో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయనున్నారు

AP 10th Exams: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలు వాయిదా

Ap Ssc

AP 10th Exams: ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. ముందుగా మే 2 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని ప్రకటించినా..ఇంటర్ పరీక్షల షెడ్యూల్ అడ్డు తగలడంతో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయనున్నారు. మే 9 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జేఈఈ మెయిన్స్ పరీక్షలు కారణంగా ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో ఇప్పటికే మార్పులు చేశారు. మారిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరగనున్నాయి.

Also read:Free Coaching : పోలీసు ఉద్యోగాలకు… పోటీపడే అభ్యర్ధులకు ఉచిత కోచింగ్

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మే 2 నుంచి 13వ తేదీ వరకు జరగాలిసి ఉండగా.. ఒకేసారి ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నాపత్రాలకు పోలీస్ బందోబస్తు ఇబ్బంది అవుతుందని భావించారు అధికారులు. దీంతో టెన్త్ పరీక్షలు వాయిదా వేశారు. ఈమేరకు కొత్త షెడ్యూల్ ప్రకటన నిమిత్తం ప్రభుత్వం అనుమతి కోరుతూ పరీక్షల విభాగం విజ్ఞప్తి పంపింది. సోమవారం నాడు పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల చేయనున్నారు. కాగా మొదటిసారిగా పదో తరగతిలో 7 పేపర్లతో పరీక్షలు నిర్వహించబోతున్నారు. దీంతో పరీక్ష పరీక్ష మధ్య రెండు రోజుల విరామం ఇవ్వనున్నారు.

Also read: Half Day Schools : తెలంగాణలో ఒంటిపూట బడులు.. ఈ నెల 16 నుంచే…