Half Day Schools : తెలంగాణలో ఒంటిపూట బడులు.. ఈ నెల 16 నుంచే…

ఎండలు అధికంగా ఉండటంతో పాఠ‌శాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటి పూట బ‌డుల‌కు..

Half Day Schools : తెలంగాణలో ఒంటిపూట బడులు.. ఈ నెల 16 నుంచే…

Half Day Schools

Updated On : March 12, 2022 / 11:13 PM IST

Half Day Schools : ఎండ‌లు అప్పుడే మండిపోతున్నాయి. సూర్యుడు భగభగ మండిపోతూ నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకి ప‌గ‌టి పూట ఉష్ణోగ్ర‌త‌లు పెరిగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎండలు అధికంగా ఉండటంతో పాఠ‌శాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఒంటి పూట బ‌డుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 16 నుంచి ఒంటి పూట బ‌డులు నిర్వ‌హించాల‌ని అన్ని పాఠ‌శాల‌ల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు శ‌నివారం తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.

ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న‌ ఒంటిపూట బడులను ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం త‌న ఆదేశాల్లో తెలిపింది. ఇదిలా ఉంటే.. మే 20వ తేదీన 10వ తరగతి ప‌రీక్ష‌లు ముగియనున్నాయి. అదే రోజు స్కూళ్లకు చివరి పనిదినం కానుంది. జూన్ 12వ తేదీ నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.