Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం

కొవిడ్ మహమ్మారి లాంటి సమస్యలను తట్టుకునేందుకు 18 ఏళ్లు పైబడిన వారికి అందించే బూస్టర్ డోస్ గ్యాప్‌ను ఇప్పటికే ఉన్న 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

 

 

Booster Dose: కొవిడ్ మహమ్మారి లాంటి సమస్యలను తట్టుకునేందుకు 18 ఏళ్లు పైబడిన వారికి అందించే బూస్టర్ డోస్ గ్యాప్‌ను ఇప్పటికే ఉన్న 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.

NTAGI స్టాండింగ్ టెక్నికల్ సబ్-కమిటీ (STSC) COVID-19 వ్యాక్సిన్‌ల రెండో, ముందు జాగ్రత్త మోతాదుల మధ్య అంతరాన్ని ప్రస్తుత తొమ్మిది నుండి ఆరు నెలల నుండి తగ్గించాలని గతంలోనే రికమెండ్ చేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ సిఫార్సుపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

ప్యానెల్ సభ్యులు బూస్టర్ షాట్‌ల కోసం మిక్సింగ్ జాబ్‌ల ఫలితాల్లో లోపాన్ని కనుగొన్నారు. ప్రస్తుతానికి దాని కోసం ఎటువంటి సిఫార్సు చేయలేమని పేర్కొన్నారు. కోవిషీల్డ్, కోవాక్సిన్‌లపై ఈ స్టడీ జరిపారు.

Read Also : కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌.. డీసీజీఐ అనుమతి..

మంకీపాక్స్ ముప్పు, టీకా ఆవశ్యకత గురించి కూడా నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఎజిఐ) ప్యానెల్ సమావేశంలో చర్చించినట్లు వర్గాలు తెలిపాయి. “ప్రస్తుతానికి పటిష్టమైన నిఘా అవసరమని సభ్యులు అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులేవీ కనుగొనబడలేదు,” అని తేల్చారు.

ట్రెండింగ్ వార్తలు