India-China Clash: రైతుల ముందు 56, చైనా ముందు 0.56.. మోదీపై ఆప్ ఫైర్

రైతులకు 56 అంగుళాలు చూపించే ప్రభుత్వం చైనా ముందు మాత్రం 0.56 అంగుళాలకు కుంచించుకుపోతుంది. చైనా సైనికులు దురాక్రమణలకు పాల్పడుతుంటే మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఈ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి? దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చైనా దురాక్రమణలపై పార్లమెంటులో చర్చ జరగాలి

India-China Clash: చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపధ్యంలో మోదీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రైతుల ముందు 56 అంగుళాల చాతిని చూపించే కేంద్ర ప్రభుత్వం, అదే చైనా ముందుకు రాగానే 0.56 అంగుళాలకు కుంచించుకుపోయిందంటూ ఎద్దేవా చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఆక్రమణల నేపథ్యంలో, ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం చర్చకు ముందుకు రాకపోవడాన్ని ఆ పార్టీ తప్పు పట్టింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.

Amit Shah: డ్రగ్స్ స్మగ్లర్లకు డెడ్ లైన్ పెట్టిన అమిత్ షా.. ఆ తర్వాత ఇక ఎవరూ మిగలరట

ఈ విషయమై విపక్షాలు పార్లమెంట్ సమీపంలోని గాంధీ విగ్రహం ముందు బుధవారం నిరసనకు దిగాయి. ఈ సందర్భంగా ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ ‘‘రైతులకు 56 అంగుళాలు చూపించే ప్రభుత్వం చైనా ముందు మాత్రం 0.56 అంగుళాలకు కుంచించుకుపోతుంది. చైనా సైనికులు దురాక్రమణలకు పాల్పడుతుంటే మోదీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఈ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి? దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చైనా దురాక్రమణలపై పార్లమెంటులో చర్చ జరగాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ నిరనలో ఆప్, కాంగ్రెస్, జేడీయూ, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, శివసేన, డీఎంకే, ఎన్‌సీపీ సహా 12 విపక్ష పార్టీలు పాల్గొన్నాయి.

Maha vs Karnataka: చైనా తరహాలో కార్ణాటకలోకి దూకుతామంటూ శివసేన వార్నింగ్.. ఐక్యంగా ఉందామని షిండే రిక్వెస్ట్

ట్రెండింగ్ వార్తలు