Green Channel : అవయవదానం : మదురై నుంచి చెన్నైకి 76 నిమిషాల్లో ఊపిరి తిత్తులు

రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 29 ఏళ్ల యువకుడి ఊపిరి తిత్తులను మదురై నుంచి చెన్నైకి 76 నిమిషాల్లో చేర్చి ఒకరి ప్రాణం నిలిపారు వైద్యులు.

Green Channel : రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 29 ఏళ్ల యువకుడి ఊపిరి తిత్తులను మదురై నుంచి చెన్నైకి 76 నిమిషాల్లో చేర్చి ఒకరి ప్రాణం నిలిపారు వైద్యులు.

మదురైలో  రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా యువకుడి (29) మెదడు నిర్జీవమైపోయింది. దీంతో అతడి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఆ  యువకుడి కిడ్నీలు, ఊపిరితిత్తులు, నేత్రాలు తొలగించి అవసరమైన వారికి అందచేసేందుకు అక్కడి డాక్టర్లు చర్యలు చేపట్టారు.

చెన్నైలోని వడపళని పోర్టిన్ ఆస్పత్రిలో ఊపిరి తిత్తుల మార్పిడి కోసం ఎదురు చూస్తున్న యువకుడికి వాటిని అమర్చేందుకు మదురై ఆస్పత్రి వైద్యులు చర్యలు చేపట్టారు. వెంటనే ఊపిరి తిత్తులను అంబులెన్స్ లో మదురై విమానాశ్రయానికి తరలించారు.

Also Read : Hut Collapsed : గుడిసె కూలి ఐదుగురు మృతి

అక్కడి నుంచి విమానం ద్వారా చెన్నై చేర్చారు. ఎయిర్  పోర్టు నుంచి వడపళనిలోని ఫోర్టిన్ ఆస్పత్రికి ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఊపిరి తిత్తులను చేర్చారు. వైద్యులు వెంటనే రోగికి ఊపిరి తిత్తులు అమర్చి పునర్జన్మనిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు