Kashmir Grenade Attack : జమ్ముకశ్మీర్​లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హరిసింగ్ హైస్ట్రీట్ ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి చేశారు (Kashmir Grenade Attack)

Kashmir Grenade Attack : జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హరిసింగ్ హైస్ట్రీట్ ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఒక పౌరుడు మృతి చెందాడు. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక పోలీస్ అధికారి ఉన్నారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న శ్రీ మహారాజా హరి సింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు శ్రీనగర్ లోని నౌహట్టా ప్రాంతానికి చెందిన మహ్మద్ అస్లాం మఖ్దూమీగా(71) గుర్తించారు. గ్రెనేడ్ దాడి జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్​ ఆపరేషన్​ను ప్రారంభించాయి. (Kashmir Grenade Attack)జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్ లోని హరిసింగ్ హైస్ట్రీట్ ప్రాంతంలో భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రెనేడ్ దాడి చేశారు.

”ఆదివారం సాయంత్రం నాలుగన్నర గంటల ప్రాంతంలో రద్దీగా ఉండే మార్కెట్ లో ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. వీకెండ్ కావడంతో పెద్ద సంఖ్య ప్రజలు మార్కెట్ కు వచ్చారు. ఈ దాడిలో 71 ఏళ్ల వృద్ధుడు స్పాట్‌లోనే మరణించాడు. 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పోలీసులూ ఉన్నారు” అని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. (Kashmir Grenade Attack)

ఈ ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు స్పాట్ కి వచ్చాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను పట్టుకునేందుకు సమీప ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు.

Bhagalpur : బీహార్‌‌లో పేలుడు ఘటనలో 14 మంది మృతి.. ATS విచారణ

ఉగ్రదాడితో జమ్ముకశ్మీర్‌ మరోసారి ఉలిక్కిపడింది. హరిసింగ్‌ హైస్ట్రీట్‌ దగ్గర కాపలా కాస్తున్న పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. కాగా దాడిలో అధికంగా సామాన్య పౌరులే గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ పోలీసు, మరో బాలిక పరిస్థితి విషయంగా ఉందని అధికారులు తెలిపారు.(Kashmir Grenade Attack)

ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్ర దాడులను అడ్డుకోవడానికి ఇటు భారత్, అటు పాకిస్తాన్ ఏమీ చేయడం లేదన్నారు. రక్తపాతాన్ని ఆపడానికి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుడి కుటుంబసభ్యులకు ఆమె తన సంతాపం తెలిపారు.

జమ్ముకశ్మీర్ లో కలకలం : భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల ప్లాన్

ఈ దాడిని ఖండిస్తున్నట్టు మరో మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి జన్నత్‌లో చోటుదక్కుతుందని ఆశిస్తున్నానని అన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

మరోవైపు జమ్ముకశ్మీర్​లోని సాంబా బోర్డర్ లో పాకిస్తాన్ చొరబాటుదారుల ఆగడాలు మితిమీరాయి. దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ముగ్గురు పాక్​ స్మగ్లర్లను బీఎస్​ఎఫ్​ బలగాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల ద్వారా ముగ్గురు పాకిస్తానీ స్మగ్లర్లు చొరబడుతుండగా భద్రతా దళాలు వారిని హతమార్చాయని, వారి నుంచి 36 ప్యాకెట్ల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్​ఎఫ్​ అధికారులు తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో చొరబాట్లను నిరోధించేందుకు భద్రతను కట్టుదిట్టం చేశామని, తనిఖీలు ముమ్మరం చేశామని బలగాలు వెల్లడించాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు