Bhagalpur : బీహార్‌‌లో పేలుడు ఘటనలో 14 మంది మృతి.. ATS విచారణ

ఈ ఘటనపై బీహార్ డీజీపీ SK Sibghal మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా ఇంటిని అద్దెకు తీసుకుని బాణాసంచా తయారీ నడుపుతున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. దీనిపై ఏటీఎస్ విచారణ..

Bhagalpur : బీహార్‌‌లో పేలుడు ఘటనలో 14 మంది మృతి.. ATS విచారణ

Bihar

Bhagalpur House Blast : బీహార్ లోని భాగలాపూర్ ప్రాంతంలో జరిగిన భార పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 14 మంది చనిపోగా..పది మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారు. పేలుడు ఘటనపై ఏటీఎస్ నేతృత్వంలో విచారణ జరుగుతోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలపై సమాచారం తెలుసుకున్నారు. క్షతగాత్రులను జవహార్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ప్రభావం తీవ్రంగా ఉంది. మూడు ఇళ్లకు పగులు ఏర్పడ్డాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న స్థానిక పీఎస్ ఇన్ చార్జ్ సుధాంశు కుమార్ ను సస్పెండ్ చేశారు.

Read More : Bhagalpur : బీహార్‌‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

ఈ ఘటనపై బీహార్ డీజీపీ SK Sibghal మీడియాతో మాట్లాడారు. అనుమతి లేకుండా ఇంటిని అద్దెకు తీసుకుని బాణాసంచా తయారీ నడుపుతున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. దీనిపై ఏటీఎస్ విచారణ చేపట్టనుందని, ప్రస్తుతం నమూనాలను సేకరించే పనిలో ఉందన్నారు. ముడి బాంబులు, బాణసంచా తయారీ ఉపయోగించే పౌడర్, ఇనుప మేకులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ ద్వారా వివరాలు సేకరించడం జరిగిందని బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, రెస్క్యూ కార్యకలాపాలను పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై ప్రధాన మంత్రి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. భాగల్ పూర్ లో పేలుడులో చనిపోవడం బాధకరమైందని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.