GST Council meeting
Delhi Vigyan Bhavan : ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో 50వ జీఎస్టీ మండలి సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. జీఎస్టీ మండలి సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు, అధికారులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి హరీష్ రావు,బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. వివిధ రంగాలపై పన్ను విధించడంపై జీఎస్టీ మండలికి జీవోఎం నివేదిక అందించనుంది.
ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో గుర్రపు పందాలపై పన్ను విధించే అంశంపై నేడు జీఎస్టీ మండలిలో నిర్ణయం ఉండే అవకాశం ఉంది. పన్ను రేట్లు, మినహాయింపులు పరిపాలనా విధానాలు జీఎస్టీకి సంబంధించిన కీలక అంశాలను నిర్ణయించడంలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషిస్తోంది. జీఎస్టీ రాజ్యాంగం, ట్రిబ్యునల్స్, బెంచ్ ల ఏర్పాటుపై చర్చించి నేడు జీఎస్టీ మండలిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పొగాకు ఉత్పత్తులపై పరిహారం సెస్ పెంపుపై చర్చించనున్నారు. ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు అన్ని పొగాకు ఉత్పత్తులపై పరిహారం సెస్‌ను పెంచాలని వైద్యులు, ఆర్థికవేత్తలు , ప్రజారోగ్య సంఘాలు జీఎస్టీ మండలిని కోరారు. అధిక పన్నుల వల్ల మిలియన్ల కొద్దీ పొగాకు వినియోగదారులను నిష్క్రమించడానికి యువకులు పొగాకు వినియోగాన్ని ప్రారంభించకుండా నిరోధించడానికి ప్రేరేపిస్తుందని జీఎస్టీ మండలికి నిపుణులు తెలిపారు.
గ్లోబల్ హెల్త్ బాడీ ప్రకారం, పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి పన్నుల పెంపు ద్వారా పొగాకు ఉత్పత్తుల ధరలను పెంచడం అత్యంత ప్రభావవంతమైన విధానమని సూచించారు. 2017-18లో పొగాకు వాడకం వల్ల సంభవించే అన్ని వ్యాధులు, మరణాల వల్ల వార్షిక ఆర్థిక వ్యయాలు 1,77,341 కోట్లుగా అంచనా. పొగాకు వాడకం ప్రతి సంవత్సరం 13 లక్షల మంది భారతీయలు ప్రాణాలు కోల్పోతున్నారు.
Helicopter : నేపాల్ దేశంలో హెలికాప్టర్ మాయం..ఆరుగురు గల్లంతు
ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అంతర్-రాష్ట్ర సరఫరాలు జరిపే… చిన్న సరఫరాదారులను జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుండి మినహాయిపు, పొగాకు ఉత్పత్తులపై పరిహారం సెస్‌ను పెంచే ప్రతిపాదన ఉంచారు. ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై పన్ను విధింపు, సినిమా హాళ్లలో విక్రయించే ఆహారం, పానీయాలపై పన్ను మినహాయింపు. రూ. 36 లక్షలు ఖరీదు చేసే మందులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరనున్నారు.
క్యాన్సర్ మందు ‘Dinutuximab’ పై దిగుమతి GST మినహాయింపు, ఉపగ్రహ ప్రయోగ సేవపై పన్ను మినహాయింపు, MUVలు, SUVలపై పన్ను విధింపు, ‘స్కీమ్ ఫర్ బడ్జెటరీ సపోర్ట్’ కింద 11 కొండ ప్రాంతాల రాష్ట్రాలలో పూర్తి CGST, 50 శాతం IGST రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై మండలి చర్చించనుంది. వీటికి తోడు పలు రాష్ట్రాలు కూడా కొన్ని డిమాండ్లను లేవనెత్తనున్నట్లు సమాచారం.