గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బనస్కాంత జిల్లా త్రిశూలియా ఘాట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకం 21మంది మృతి చెందారు. మరో 53 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.వీరిలో 23మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా అంక్లేవ్ అనే గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఆలయాన్ని సందర్శించుకొని వారంతా ఆనందంగా ఇంటికి వెళ్తున్నారు. ఇంతలోనే ఊహించని మలుపులో మృత్యువు వారి మీద విరుచుకుపడింది. ఏకంగా 21 మంది మృత్యువాత పడ్డారు. మరో 53 మంది గాయాలపాలయ్యారు. ఈ విషాద ఘటన గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. అంక్లేవ్ అనే గ్రామానికి చెందిన
అంక్లేవ్ గ్రామానికి చెందినవారు అంబాజీ పట్టణంలోని అంబాజీ దేవాలయాన్ని సందర్శించుకోవటానికి ఒక ప్రైవేట్ బస్సులో వెళ్లారు. దేవుడి దర్శించుకున్న తరువాత సోమవారం (సెప్టెంబర్ 30)సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. అంబాజీ-దంత రహదారి సమీపాన కొండ మార్గంలో త్రిశూలియా ఘాట్ సమీపంలోకి వచ్చిన బస్సు అదుపు తప్పింది. దీంతో బస్ కంట్రోల్ కాలేదు. 70మంది ప్రయాణీకులున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడి పల్టీలు కొట్టి తలకిందులుగా పడిపోయింది.
ఈ ఘటనలో 21 మంది అక్కడికక్కడే మరణించగా..53 మంది గాయపడ్డారు. వారిలో 35 మంది పరిస్థితి విషమంగా ఉంది. భారీ వర్షాలు కురవడం..పైగా కొండ ప్రాంతం కావడంతో బస్ టైర్లు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.గాయపడివారందరినీ సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.
ఈ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో 70 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు త్రిశూలియా ఘాట్ వద్ద బోల్తా పడిందని బనస్కాంత జిల్లా ఎస్పీ అజిత్ రాజియన్ తెలిపారు . ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులంతా త్వరగా కోరుకోవాలని ప్రార్థించారు.