tallest Lord Krishna statue
Lord Krishna Tallest Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం క్యాబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హృషికేష్ పటేల్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ద్వారకా జిల్లాలోని దేవభూమి ద్వారకా కారిడార్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని నిర్మించనున్నట్లు, ఇందుకు సంబంధించి మొదటి దశ పనులు వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవుతాయని తెలిపారు.
Lord Krishna idol-Eidgah row: కృష్ణుని విగ్రహ ప్రతిష్టాపనకు హై సెక్యూరిటీ.. బాబ్రీ ఘటన జరిగిన రోజే
దేవభూమి ద్వారకా కారిడార్‌లో ద్వారకాధీష్ ఆలయానికి ప్రసిద్ధి చెందిన నగరం 3డీ ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ జోన్, శ్రీమద్ భగవద్గీత అనుభవ క్షేత్రాన్ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. పలు ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయంగా దేవ భూమి ద్వారకా కారిడార్‌ను మార్చడం ద్వారా ఈ ప్రాంతాన్నిపశ్చిమ భారతదేశంలోనే అతిపెద్ద ఆథ్యాత్మిక కేంద్రంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో శ్రీకృష్ణుడి అతిపెద్ద విగ్రహానికి సంబంధించిన మొదటి దశ పనులు ప్రారంభిస్తామని, ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో పురాతన ద్వారకా నగరంకు సంబంధించిన అవశేషాలను ప్రజలు చూసేలా వ్యూయింగ్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు పటేల్ తెలిపారు.