Janmashtami: లండన్‌లో భార్యతో కలిసి గుడికి వెళ్ళిన రిషి సునక్.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నానని ట్వీట్

బ్రిటన్ ప్రధాని ప‌ద‌వికి పోటీ చేస్తోన్న ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ లండన్‌లో భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో తన భార్య అక్షతా మూర్తితో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఇవాళ నేను భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని నా భార్య అక్షతా మూర్తితో కలిసి దర్శించుకుని, జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నాను అని పేర్కొన్నారు.

Janmashtami: లండన్‌లో భార్యతో కలిసి గుడికి వెళ్ళిన రిషి సునక్.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నానని ట్వీట్

Janmashtami: ప్రపంచ వ్యాప్తంగా హిందువులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆలయాల్లో వేడుకల నిర్వహణ వైభవంగా జరుగుతోంది. ఉదయం నుంచే భక్తులు కృష్ణుడిని దర్శించుకోవడానికి ఆలయాల్లో క్యూ కట్టారు. ఇస్కాన్‌ మందిరాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు అలరిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని ప‌ద‌వికి పోటీ చేస్తోన్న ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంత‌తి నేత రిషి సునక్ లండన్‌లో భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించారు.

ఆలయంలో తన భార్య అక్షతా మూర్తితో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ‘ఇవాళ నేను భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని నా భార్య అక్షతా మూర్తితో కలిసి దర్శించుకుని, జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నాను’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తమ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. కాగా, బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్ కు రిషి సునక్ గట్టిపోటీ ఇస్తోన్న విషయం తెలిసిందే. అయితే, లిజ్‌ ట్రస్ కంటే రిషి సునక్ వెన‌క‌బ‌డ్డార‌ని ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది.