Curfew
కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” టెన్షన్ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూని డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఎనిమిది ప్రధాన నగరాలు-అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, భావ్‌నగర్, జామ్‌నగర్, జునాఘర్ నగరాల్లో నైట్ కర్ఫ్యూను డిసెంబర్ 31 పొడిగించినట్టు ప్రకటించింది. ఆయా నగరాల్లో రాత్రి ఒంటి గంట ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఈ మేరకు గుజరాత్ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకుముందు డిసెంబర్-10 వరకే నైట్ కర్ఫ్యూ పొడిగించబడిన విషయం తెలిసిందే. ఇక,ఇప్పటివరకు గుజరాత్ లో 11 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ALSO READ J&K Delimitation : జమ్మూలో కొత్తగా ఆరు,కశ్మీర్ లో ఒకటి..డీలిమిటేషన్ ప్రతిపాదనపై రగడ