High Court of Gujarat: హైకోర్టు ఆవరణలో కోక్ తాగిన పోలీస్.. వింత శిక్ష విధించిన జడ్జి

గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ కోర్టు ఆవరణలో కోక్ తాగిన పోలీసుకు వింత శిక్షను విధించారు. ఏఎమ్ రాథోడ్ అనే పోలీస్ ఆన్‌లైన్ కోర్టు విచారణలో ఉండగా కోకా-కోలా...

High Court of Gujarat: గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ కోర్టు ఆవరణలో కోక్ తాగిన పోలీసుకు వింత శిక్షను విధించారు. ఏఎమ్ రాథోడ్ అనే పోలీస్ ఆన్‌లైన్ కోర్టు విచారణలో ఉండగా కోకా-కోలా క్యాన్ తాగుతున్నట్లు చీఫ్ జస్టిస్ కుమార్ గమనించారు. వెంటనే గవర్నమెంట్ లాయర్ ను దీనిపై ప్రశ్నించారు.

‘పోలీసాఫీసర్ కోర్టుకు ఇలానే హాజరవుతారా.? ఆన్ లైన్ కాకుండా మామూలుగా కోర్టు కార్యక్రమాలు జరిగితే క్యాన్ తీసుకుని వస్తారా అంటూ ఆ కోకా కోలా రాథోడ్ ను ప్రశ్నించారు.

ఇదే క్రమంలో మరో అడ్వకేట్ ఆన్ లైన్ విచారణలో ఉండగా సమోసా తింటూ కనిపించాడు.

Read Also: వివాహేత‌ర సంబంధం విషయంలో గుజరాత్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

‘మీరు సమోసా తినడం వల్ల మాకేం ఇబ్బంది లేదు. మాముందు తినడం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇతరులు కూడా దీనిని చూసి టెంప్ట్ అవ్వొచ్చు. అతని అందరికీ సమోసాను పంచాలి. లేదంటే సమోసా తినకుండానైనా ఉండాలి’ అని ఆ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆదేశించారు.

అదే తరహాలో పోలీసాఫీసర్ కూడా 100కూల్ డ్రింక్ లను బార్ అసోసియేషన్ కు ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు.

కూల్ డ్రింక్ ఒక్కడే తాగొద్దని, ఇతరులతోనూ అది పంచుకోవాలని చెప్పింది కోర్ట్. సమోసా తింటూ కనిపించిన వ్యక్తిని అందరికీ సమోసా పంపించాలని ఆదేశాలు ఇచ్చారు.

Read Also: హైకోర్టు సంచలన తీర్పు.. ఆ అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదు..!

ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఇద్దరు మహిళలపై దాడి చేశాడంటూ పోలీసాఫీసర్ మీద ఇతర అధికారుల మీద వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణ జరుపుతుండగా ఈ ఘటన జరిగింది.

ట్రెండింగ్ వార్తలు