Gujarat High : వివాహేత‌ర సంబంధం విషయంలో గుజరాత్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వివాహేత‌ర సంబంధం ఏర్పరుచుకున్నాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై పోలీస్ కానిస్టేబుల్‌ను తొల‌గిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల‌ను జ‌స్టిస్ సంగీత విశెన్ కొట్టివేశారు.

Gujarat High : వివాహేత‌ర సంబంధం విషయంలో గుజరాత్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Gujarat

Extramarital affair : వివాహేత‌ర సంబంధం విషయంలో గుజరాత్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహేత‌ర సంబంధాన్ని సామాజిక కోణంలో అనైతిక చ‌ర్యగా చూడ‌వ‌చ్చని, అయితే ఇదే కార‌ణంతో దుష్ర్పవ‌ర్తన‌గా ప‌రిగణించి పోలీస్ స‌ర్వీస్ నిబంధ‌న‌ల కింద పోలీస్‌ను స‌ర్వీస్ నుంచి తొల‌గించ‌లేర‌ని తెలిపింది. వివాహేత‌ర సంబంధం ఏర్పరుచుకున్నాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై పోలీస్ కానిస్టేబుల్‌ను తొల‌గిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల‌ను జ‌స్టిస్ సంగీత విశెన్ కొట్టివేశారు. నెల‌రోజుల్లోగా అత‌డిని తిరిగి విధుల్లోకి తీసుకోవాల‌ని 2013 న‌వంబ‌ర్‌లో అత‌డిని స‌ర్వీస్ నుంచి తొల‌గించిన‌ప్పటి నుంచి 25 శాతం చొప్పున వేత‌నాన్ని చెల్లించాల‌ని అహ్మదాబాద్ పోలీసుల‌ను ఆదేశించారు.

Gujarat HC : పెళ్లికాకుండా తల్లి అయితే బిడ్డ తండ్రి ఎవరో చెప్పాలా? గుజరాత్ హైకోర్టు

వితంతువుతో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నందుకు త‌న‌ను స‌ర్వీస్ నుంచి తొల‌గించ‌డాన్ని స‌వాల్ చేస్తూ కానిస్టేబుల్ హైకోర్టును ఆశ్రయించాడు. పిటిష‌న‌ర్ క్రమ‌శిక్షణాయుత బ‌ల‌గాల్లో భాగ‌స్వామి అన‌డం వాస్తవ‌మేన‌ని..అత‌డి ప్రవ‌ర్తన స‌మాజం దృష్టికోణంలో అనైతిక‌మ‌ని..అయితే దీన్ని దుష్ర్పవ‌ర్తన ప‌రిధిలోకి తీసుకురావ‌డం సంక్లిష్టమ‌ని ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది.

కానిస్టేబుల్ చ‌ర్య పూర్తిగా ప్రైవేట్ వ్యవ‌హార‌మ‌ని ఆయ‌న ఎవ‌రినీ బ‌ల‌వంత‌పెట్టడం, ఒత్తిడి చేయ‌డం జ‌ర‌గ‌లేద‌ని గుర్తుచేసింది. పిటిష‌న‌ర్ చ‌ర్యను స‌మాజం కోణంలో అనైతికంగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చని, ప్రవ‌ర్తనా నిబంధ‌న‌లు, 1971 కింద దీన్ని దుష్ర్పవ‌ర్తన‌గా అభివ‌ర్ణించ‌డం స‌రైంది కాద‌ని ఉత్తర్వుల్లో కోర్టు స్పష్టం చేసింది.