Godhra Train Burning Case: గోద్రా రైలు దహనం దోషులకు బెయిల్ ఇవ్వొద్దన్న గుజరాత్ ప్రభుత్వం.. బిల్కిస్ నిందితులకు ఎందుకు ఇచ్చారంటూ విమర్శలు

11 మందికి విధించిన మరణ శిక్షను గుజరాత్‌ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని కోర్టుకు తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ రైలు దహనంపై దోషుల వ్యక్తిగత పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాల్సిందిగా గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూనే తదుపరి విచారణను డిసెంబరు 15కి వాయిదా వేసింది.

Godhra Train Burning Case: 2002లో గోద్రా సమీపంలో రైలు దహనం కేసులో దోషులకు బెయిల్ ఇవ్వొద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. ఆ కేసులో దోషులకు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది. శనివారం దీనిపై విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంలో వాదనలు వినిపిస్తూ కోచ్‭కు నిప్పు పెట్టిన అనంతరం రాళ్ల దాడి జరిగిందని, ఆ దాడి కారణంగానే ప్రయాణికులు కోచ్ నుంచి తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారని వివరించారు.

2002, ఫిబ్రవరి 27న గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పంటించడంతో ఎస్‌-6 బోగీలోని 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసుకు సంబంధించి కొందరు దోషులు తమకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ విషయమై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే వారు 17-18 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినందున వారి పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవచ్చన్న ధర్మాసనం, దోషుల వ్యక్తిగత పాత్రలను పేర్కొనవలసిందిగా రాష్ట్రాన్ని కోరింది.

The Kashmir Files Row: ది కశ్మీర్ ఫైల్స్‭పై కామెంట్స్ ఎఫెక్ట్.. ఇజ్రాయెల్ రాయబారికి విధ్వేష సందేశాలు

మరోవైపు దోషుల బెయిల్‌ పిటిషన్లు 2017 అక్టోబర్‌లో గుజరాత్‌ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నాయని ధర్మాసనం దృష్టికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీసుకొచ్చారు. 11 మందికి విధించిన మరణ శిక్షను గుజరాత్‌ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చిందని కోర్టుకు తెలిపారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ రైలు దహనంపై దోషుల వ్యక్తిగత పాత్రలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలపాల్సిందిగా గుజరాత్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూనే తదుపరి విచారణను డిసెంబరు 15కి వాయిదా వేసింది.

ఇకపోతే, రైలు దహనం దోషులకు బెయిల్ ఇవ్వొద్దని గుజరాత్ ప్రభుత్వం వాదించడంపై కొంత మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్కిస్ బానో అత్యాచార నిందితులకు ప్రభుత్వం ఎందుకు బెయిల్ ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు. దోషులెవరికీ బెయిల్ ఇవ్వడాన్ని తాము సమర్ధించమని, అయితే గుజరాత్ ప్రభుత్వమే ఉద్దేశ పూర్వకంగా కొందరికి అనుకూలంగా, కొందరికి ప్రతికూలంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.

Gujarat Polls: గుజరాత్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గుదలకు అదే అసలు కారణమట

ట్రెండింగ్ వార్తలు