స్కూల్ ప్రిన్సిపాల్‌ను పొడిచి చంపిన టీచర్

Teacher Stabs: స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న 30ఏళ్ల వ్యక్తిని బంధువయ్యే వ్యక్తి పొడిచి చంపారు. ఘటనలో అతని భార్యతో పాటు మైనర్ కూతురు కూడా గాయపడినట్లు గుజరాత్‌లోని చైతౌదేపూర్ జిల్లాకు చెందిన పోలీసులు చెబుతున్నారు. భారత్ పీఠియా(28) అనే నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రభుత్వం నడిపిస్తోన్న స్కూల్‌లో ఉదయం సమయంలో ఘటన జరిగినట్లు ఎస్ఐ సీడీ పటేల్ కన్ఫామ్ చేశారు. ముందుగా మేరామన్ పీఠియా భార్య కాజల్‌పై పెద్ద కత్తితో దాడి చేశాడు నిందితుడు. పలుమార్లు పొడిచి మైనర్ కూతురిపై కూడా దాడికి పాల్పడ్డాడు.



బాధితుడు మేరామన్ మరో జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఎదురింట్లో ఉండే నిందితుడు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. బాధితుడు మృతిచెందగా భార్య, కూతురు నస్వాడీ హాస్పిటల్ లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.