Guru Teg Bahadur: గురు తేగ్‌ త్యాగం శ్లాఘనీయం.. సెక్యూరిటీ లేకుండా గురుద్వారాకు ప్రధాని!

గురు తేగ్‌ బహదూర్‌ త్యాగం శ్లాఘనీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం ప్రధాని మోడీ ఎటువంటి భద్రత, బందోబస్తు లేకుండా ఢిల్లీలోని గురుద్వారా సిస్‌ గంజ్‌ సాహిబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గురు తేగ్ బహదూర్ కు మోడీ నివాళులు అర్పించారు

Guru Teg Bahadur: గురు తేగ్‌ బహదూర్‌ త్యాగం శ్లాఘనీయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గురు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా శనివారం ఉదయం ప్రధాని మోడీ ఎటువంటి భద్రత, బందోబస్తు లేకుండా ఢిల్లీలోని గురుద్వారా సిస్‌ గంజ్‌ సాహిబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా గురు తేగ్ బహదూర్ కు మోడీ నివాళులు అర్పించారు. గురుద్వారాలో ఆయన ప్రార్థనలు చేసి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల కోసం గురు తేగ్‌ బహదూర్‌ చేసిన కృషిని మోడీ కొనియాడారు.

అంతకు ముందు ఆయన ట్విట్టర్‌ వేదికగా గురు తేగ్‌ బహదూర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాలకు చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడ్డారని, ఆయన చేసిన అత్యున్నత తాగం చాలా మందికి బలాన్ని, ప్రేరణ ఇస్తుందని ట్వీట్‌ చేశారు. కాగా, ప్రధాని గురుద్వారాకు వెళ్తారని ముందుగా ఎలాంటి షెడ్యూల్ లేదు. షెడ్యూల్ లో లేని పర్యటన కావడంతో పోలీసులు ఎలాంటి బందోబస్తు చేయలేదు. గురుద్వారా వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించలేదని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Read: Amara Raja Group: అమరరాజాకు షాక్.. ప్లాంట్లు మూసేయాలని పొల్యూషన్​ ​బోర్డు ఆదేశాలు!

ట్రెండింగ్ వార్తలు