Guwahati-Bikaner : బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 12 బోగీలు.. ముగ్గురు మృతి

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలుప్రమాదం జరిగింది. బికనీర్‌- గౌహతి ఎక్స్‌ప్రెస్‌ రైలు డొమోహని (Domohani) వద్ద పట్టాలు తప్పింది. 15మంది ప్రయాణికులు గాయపడగా.. ముగ్గురు మృతిచెందారు.

Guwahati-Bikaner Express Derails : పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలుప్రమాదం జరిగింది. బికనీర్‌- గౌహతి ఎక్స్‌ప్రెస్‌ రైలు డొమోహని (Domohani) వద్ద పట్టాలు తప్పింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో రైలు 12 బోగీల వరకు అదుపుతప్పాయి. నాలుగు నుంచి ఐదు బోగీలు స్లీపర్ కోచ్‌లే ఉన్నాయని మీడియా నివేదిక వెల్లడించింది.

గౌహతి-బికనీర్ ఎక్స్ ప్రెస్ 15633 (యూపీ) గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ మేరకు భారతీయ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. పట్నా నుంచి గౌహతి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మెయినగిరి దాటిన వెంటనే రైలు ఒక్కసారిగా కుదుపునకు గురికావడంతో చాలా బోగీలు పట్టాలు తప్పాయి. పలువురు ప్రయాణికులు బోగీల్లోనే చిక్కుకున్నారు.

15మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. ముగ్గురు మృతిచెందినట్టు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహయక చర్యలను చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదంపై సీఎం మమతా బెనర్జీతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి 30 అంబులెన్స్‌లు చేరుకున్నాయి. DRM, ADRM బృందాలు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.  స్థానికుల సాయంతో క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగే సమయంలో రైలు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Read Also : No Name Station: పేరులేని రైల్వే స్టేషన్ మన దేశంలోనే

ట్రెండింగ్ వార్తలు