స్వీట్ హాట్ : హల్వాతో బడ్జెట్ తయారీ ప్రారంభం

ఢిల్లీ: స్వీట్ సెరిమొనితో 2019 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ పేపర్ల ప్రింటింగ్ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. నార్త్‌బ్లాక్‌లో 2019, జనవరి 21వ తేదీ సోమవారం ఆర్థిక కార్యాలయంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా హల్వా వేడుకను ప్రారంభించారు.

  • Published By: veegamteam ,Published On : January 22, 2019 / 06:08 AM IST
స్వీట్ హాట్ : హల్వాతో బడ్జెట్ తయారీ ప్రారంభం

ఢిల్లీ: స్వీట్ సెరిమొనితో 2019 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ పేపర్ల ప్రింటింగ్ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. నార్త్‌బ్లాక్‌లో 2019, జనవరి 21వ తేదీ సోమవారం ఆర్థిక కార్యాలయంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా హల్వా వేడుకను ప్రారంభించారు.

ఢిల్లీ: స్వీట్ సెరిమొనితో 2019 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ పేపర్ల ప్రింటింగ్ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. నార్త్‌బ్లాక్‌లో 2019, జనవరి 21వ తేదీ సోమవారం ఆర్థిక కార్యాలయంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా హల్వా వేడుకను ప్రారంభించారు. దీంతో మధ్యంతర బడ్జెట్‌ కాగితాల ముద్రణ మొదలైంది. బడ్జెట్ హల్వా వేడుకలో రవాణ శాఖ మంత్రి పొన్‌ రాధకృష్ణన్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి డీఈఏ సుభాష్‌ గార్గ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. 2019, ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 2019లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో… కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్‌ను తీసుకురానుంది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఎన్నికల అనంతరం కేంద్రంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.

 

బడ్జెట్‌‌కు సంబంధించిన అంశాలను చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. బడ్జెట్‌ కసరత్తు మొదలవ్వగానే నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు మీడియాను కూడా అనుమతించరు. ఆర్థికశాఖకు చెందిన కొందరు కీలక సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారు. బడ్జెట్‌ సమర్పించడానికి పది రోజుల ముందు పేపర్ల ముద్రణను ప్రారంభిస్తారు. ఇందులో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఎంతో పకడ్బందీగా తయారయ్యే బడ్జెట్‌ కావడంతో ముందే బయటకు తెలిసిపోతే… బడ్జెట్‌ను కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దీంతో బడ్జెట్‌ తయారీని చాలా సీక్రెట్‌గా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో… బడ్జెట్‌ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి సెక్యూరిటీ, నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు… ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు.

* 1950 వరకు బడ్జెట్‌ ప్రతులను రాష్ట్రపతి భవన్‌లో ముద్రించే వారు.
* అక్కడ లీక్‌ కావడంతో దానిని మింట్‌ రోడ్‌లోని గవర్నమెంట్ ప్రెస్‌కు మార్చారు.
* ఆ తర్వాత 1980లో నార్త్‌బ్లాక్‌లోని బేస్‌మెంట్‌కు మార్పు
* బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు
* బంధువులకు కూడా ఫోన్‌ చేసుకునే అవకాశం ఉండదు.
* అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్‌ చేసుకోవచ్చు.
* ఆర్థిక మంత్రి కూడా బడ్జెట్‌కు సంబంధించిన ఎటువంటి పత్రాలు ఉంచుకోరు.
* బడ్జెట్ పత్రాలు మొత్తం జాయింట్‌ సెక్రటరీ ఆధీనంలో ఉంటాయి.