తన ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి ప్రముఖ క్రికెటర్ హర్బజన్ సింగ్ షాక్ తిన్నాడు. సామన్యుడి నుంచి ప్రముఖుల ఇళ్లకు వస్తున్న కరెంటు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. లక్షల రూపాయలు బిల్లులు వేస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ తాప్సీకి రూ. 36 వేల కరెంటు బిల్లు పంపిన విషయం తెలిసిందే.
తాజాగా..ప్రముఖ క్రికేటర్ హర్బజన్ సింగ్ కు ఇలాగే జరిగింది. కరెంటు బిల్లు చూసి షాక్ తిన్నాడు. దీనికి సంబంధించిన కరెంటు బిల్లును ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో రూ. 33 వేల 900 కరెంటు బిల్లు వచ్చిందని, తనకు మాములుగా..వచ్చే దానికంటే..ఏడింతలు ఎక్కువ అని వెల్లడించారు. తన బిల్లులో ఇతరులది కూడా కలిపేశారా అంటూ నిలదీశారు.
దీనిపై ఎలక్ట్రిసిటీ అధికారులు స్పందించారు. ఎదురైన అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే తాము సంప్రదించి సమస్యను పరిష్కరిస్తామని హమీనిచ్చారు. తమకు సమాచారం అందగానే..అతని ఇంట్లో విద్యుత్ వినియోగాన్ని తనిఖీ చేసినట్లు, బిల్లులో తప్పులేదని హర్బజన్ సింగ్ కు తెలియచేశామన్నారు.
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తరవాత..ఎక్కువగా బిల్లులు వస్తున్నాయంటూ..ముంబై ప్రజలు వెల్లడిస్తున్నారు. ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. Adani Mumbai Electricity Ltd (AMEL) 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్ (19122) ఏర్పాటు చేసింది. కాల్ చేసి వినియోగదారులు ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని, ఇదే హెల్ప్ డెస్క్ కు మెయిల్ కూడా పంపవచ్చని తెలిపారు.