Haryana Politics: చంద్రయాన్-4 లాంచ్ అవ్వగానే అందులో చంద్రుడి మీదకు పంపిస్తాం.. సీఎం ఖట్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలోని హిస్సార్ పట్టణంలో జన సంవాద్ అనే కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎం ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే ‘చంద్రయాన్-4 చంద్రుడి మీదకు వెళ్లగానే, మిమ్మల్ని అందులో పంపిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు

CM Manoharlal Khattar: చంద్రయాన్-3 సక్సెస్ అనంతరం చంద్రయాన్-4 గురించి సహజంగానే చర్చ ప్రారంభమైంది. అధికార పార్టీలోని కొందరు నేతలు చంద్రయాన్-3 సక్సెస్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మరింత అడ్వాన్సుడుగా ఉన్నారు. చంద్రయాన్-4 పని ప్రారంభమే కాలేదు. అప్పుడే ఆయన హామీలు ఇవ్వడం ప్రారంభించారు. అయితే ఇది అంత సీరియస్ మేటర్ ఏమీ కాదు. ప్రజలతో మాట్లాడుతుండగా.. ఆయన సరదాగా చంద్రయాన్-4 గురించి ప్రస్తావించారు.

Sanatana Dharma Row: సనాతన ధర్మ వివాదంపై ఇండియా కూటమిలో తలో మాట.. ఎన్నికల నాటికి కూటమి ఉంటుందా?

దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాష్ట్రంలోని హిస్సార్ పట్టణంలో జన సంవాద్ అనే కార్యక్రమం నిర్వహించారు. దీనికి సీఎం ఖట్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతున్న సందర్భంలోనే ‘చంద్రయాన్-4 చంద్రుడి మీదకు వెళ్లగానే, మిమ్మల్ని అందులో పంపిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని వీడియో తీసి నెట్టింట్లో వేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వేస్తున్నారు.


ముఖ్యమంత్రి పాల్గొన్న పబ్లిక్ డైలాగ్ కార్యక్రమంలో ఒక మహిళ మాట్లాడుతూ.. ‘వచ్చేసారి ఇక్కడ ఫ్యాక్టరీని స్థాపించడానికి ప్రయత్నించాలని డిమాండ్ ఉందని గౌరవనీయులైన మంత్రికి తెలియజేస్తున్నాం. కంపెనీ స్థాపించడం ద్వారా ప్రజలకు ఉపాధి లభిస్తుంది’’ అని చెబుతోంది. ఇంతలో ముఖ్యమంత్రి ఖట్టర్ కలుగజేసుకుని ‘‘రాబోయే రోజుల్లో చంద్రయాన్-4 లాంచ్ అవుతుంది, అందులో మిమ్మల్ని కూర్చోబెట్టి చంద్రుడి మీదకు పంపిస్తాం. ఇప్పుడైతే చూర్చోండి’’ అని అన్నారు.