Curfew
Night Curfew : కరోనా వైరస్..క్రమంగా కనుమరుగైపోతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” రూపంలో మళ్లీ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. వదల బొమ్మాళీ నిన్ను వదలా అంటూ ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు ఈ కొత్త వేరియంట్ గురించి ఎవరి దగ్గరా పూర్తి సమాచారం లేదు. అయినప్పటికీ దీనిని కట్టడి చేసేందుకు సాధ్యమైన ప్రయత్నాలన్నింటీని చేస్తున్నాయి ఆయా దేశాలు. దాదాపు 100 దేశాల్లో ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీనికి తీడు గత నాలుగైదు రోజుల నుంచి బ్రిటన్,ఫ్రాన్స్,అమెరికా వంటి కొన్ని దేశాల్లో రోజువారీ కోవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోండటం మరింత ఆందోళన కలిగించే విషయం. జనాభా తక్కువ ఉండే దేశాల్లోనే ప్రతి రోజూ లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతుంటం ఆందోళనకర పరిణామం.
అయితే అటు కోవిడ్,ఇటు ఒమిక్రాన్ ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించేందుకు అన్ని శక్తులను ఒడ్డుతోంది భారత ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా నిలువరించే దిశగా మోదీ సర్కార్ అన్ని చర్యలు చేపడుతోంది. ఇక,ఇప్పటికే ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,గుజరాత్,కర్ణాటక సహా పలు రాష్ట్రాలు క్రిస్మస్,న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తుండగా తాజాగా ఈ జాబితాలో హర్యానా కూడా చేరింది.
శుక్రవారం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ బహిరంగ ప్రదేశాల్లో 200మంది కన్నా ఎక్కువ మంది గుమిగూడటంపై,ఈవెంట్స్ నిషేధం విధిస్తున్నట్లు ఇవాళ కోవిడ్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన అనంతరం సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సృష్టం చేశారు. అదేవిధంగా,ప్రభుత్వ రంగ సంస్థలల్లోకి ప్రవేశించాలంటే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా పూర్తి అయ్యి ఉండాలని సీఎం తెలిపారు.
ALSO READ Online Cheating Gang : ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నేపాలి గ్యాంగ్ అరెస్ట్