Hawker Who Attacked Thane Municipal Official (1)
Hawker arrested for attacking TMC assistant commissioner : అక్రమ నిర్మాణాలు చేపడితే అధికారులు ఊరుకుంటారా..కూల్చి పారేస్తారు. మేము ఎన్నో ఏళ్లుగా ఇక్కడేఉంటున్నాం అంటూ కాళ్లా వేళ్లా పడినా పట్టించుకోరు జేసీబీలతో కూల్చేస్తారు.అలా మహారాష్ట్రలో అధికారులు కూడా అదే చేస్తున్నారు. దీంట్లో భాగంగా అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులను ఖాళీ చేయించేందుకు వెళ్లిన పోలీసులపై వ్యాపారులుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏకంగా ఓ మహిళా ఏసీపీ చేతి వేళ్లను తెగ్గోసిన ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.
రోడ్లు, ఫుట్‌పాత్‌లపై వీధి వ్యాపారులు అక్రమంగా దుకాణాలు పెట్టేసుకున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది. దీంతో అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులను ఖాళీ చేయించాలని థానే మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఆ శాఖ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. అధికారులతో కలిసి దుకాణాలు, తోపుడు బండ్లను ఖాళీ చేయిస్తున్నారు.
ఘోడ్‌బందర్ రోడ్డులో సోమవారం సాయంత్రం షాపులను ఖాళీ చేయిస్తుండగా కూరగాయల వ్యాపారి అమర్జీత్ యాదవ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కల్పితా పింపుల్‌పై కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో ఆమె చేతి మూడు వేళ్లు తెగిపోయాయి. తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో తోటి అధికారులంతా షాక్ అయ్యారు. వెంటనే ఏసీపీ కల్పితాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో ఏసీపీపై దాడికి పాల్పడుతున్న వ్యాపారిని అక్కడే ఉన్న తోటి పోలీసు అడ్డుకోగా అతనిపై కూడా వ్యాపారి దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. ఈదారికి పాల్పడిన వ్యాపారిని మర్జీత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.