అమిత్ షా హిస్టరీ క్లాసులు వినలేదు..శశిథరూర్

మతాల ఆధారంగా దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత శశి థరూర్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిస్టరీ కాస్లుల్లో అమిత్‌ షా మనసు పెట్టలేదంటూ శశిథరూర్ సెటైర్ పేల్చారు.

ముంబైలో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న శశిథరూర్…అమిత్ షా హిస్టరీ క్లాసుల్లో మనసు లగ్నం చేయలేదు. వాస్తవానికి హిందూ మహాసభే రెండు దేశాల సిద్ధాంతానికి మద్దతు తెలిపింది. పౌరసత్వ సవరణ బిల్లు.. రాజ్యంగంపై దాడి వంటిది. మతాల వారీగా మనం దేశాన్ని విభజించకూడదని థరూర్ అన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌పై అమిత్ షా చేసిన కామెంట్‌కు శశిథరూర్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. 

మత ప్రాతిపదికన కాంగ్రెస్ అప్పట్లో దేశాన్ని విభజించకుండా ఉంటే ఈ బిల్లు అవసరం లేకపోయేది. మతప్రాతిపదికన కాంగ్రెసే దేశాన్ని విభజించిందని సోమవారం లోక్‌సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.  మరోవైపు లోక్ సభలో ఇప్పటికే పౌరసత్వ సవరణ బిల్లు పాస్ కాగా రాజ్యసభలో బుధవారం ఆ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ట్రెండింగ్ వార్తలు