Rain : ఢిల్లీకి భారీ వర్ష సూచన

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో భారీ వర్షాలు కురువనున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్, పంజాబ్, రాజస్థాన్ లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Delhi

Heavy rain in Delhi : ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ మరోసారి ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్, పంజాబ్, రాజస్థాన్ లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఢిల్లీలో సెప్టెంబర్ 18వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

121 ఏళ్ల తరువాత ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు అయింది. 1975 తరువాత ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయింది. గడిచిన నాలుగు నెలలల్లో 113.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఈ వర్షాకాలంలో కురవాల్సిన 60 శాతం వర్షపాతం 7 రోజుల్లోనే నమోదు అయింది.

Heavy Rainfall : ఢిల్లీని కుమ్మేస్తోంది…46 ఏళ్ల తర్వాత

శనివారం దేశ రాజధానిలో కుంభవృష్టి పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏకధాటిగా కురిసింది. రహదారులు జలమయయం అయ్యాయి. భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. అండర్‌పాస్‌లలో నీళ్లు భారీగా నిలిచిపోయాయి. కార్లు, ఇతర వాహనాలు మునిగిపోయాయి. పాలం ఫ్లై ఓవర్‌ వద్ద అండర్‌ పాస్‌లో 40 మందితో ఉన్న బస్సు నీళ్లలో చిక్కుకుపోయింది. మరో చోట కూడా 18 మంది ప్రయాణికులు రెండు వాహనాల్లో చిక్కుకుపోయారు. అగ్నిమాపక దళం వారిని రక్షించింది.

ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులోకి భారీగా వరదనీరు చేరింది. విమాన సేవలకు అంతరాయం కలిగింది. రన్‌వేలు, ఎయిర్‌పోర్టు సమీపంలోని హోటళ్లు నీటిలో చిక్కుకున్నాయి. మూడు విమానాలు రద్దు అయ్యాయి. ఐదింటిని దారి మళ్లించారు. ముంబై, కొంకణ్‌, పశ్చిమ మహారాష్ట్రలో వచ్చే మూడు నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Delhi Airport : జల దిగ్బంధంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు.. వరద నీటిలో నిలిచిన విమానాలు

ఢిల్లీలో ఈ ఏడాది అనూహ్య వర్షపాతం నమోదైంది. నైరుతిలో గత 46 ఏండ్లలో పడనంత వర్షం పడింది. మొత్తం 110 సెం.మీ వర్షపాతం నమోదైంది. 1975లో నైరుతిలో కురిసిన 115 సెంటీమీటర్ల తర్వాత ఇదే అత్యధికం. సాధారణంగా ఢిల్లీలో ప్రతీ ఏడాది నైరుతిలో సగటున 65 సెం.మీ వర్షం కురిసింది.