Delhi Airport : జల దిగ్బంధంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు.. వరద నీటిలో నిలిచిన విమానాలు

భారీ వర్షాల ధాటికి ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు జల దిగ్బంధంలో చిక్కుకుంది. టీ-3 టెర్మినల్ లో వరద నీరు చేరింది. విమానాలు వరద నీటిలోనే నిలిచిపోయాయి.

Delhi Airport : జల దిగ్బంధంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు.. వరద నీటిలో నిలిచిన విమానాలు

Delhi Airport

Heavy Rains In Delhi : భారీ వర్షాల ధాటికి ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు జల దిగ్బంధంలో చిక్కుకుంది. టీ-3 టెర్మినల్ ను వరద నీరు ముంచెత్తింది. దీంతో విమానాలు వరద నీటిలోనే నిలిచిపోయాయి.

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టీ-3 టెర్మినల్ లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు వేచి ఉండే స్థలం బోడింగ్ పాస్ తీసుకునే ప్రాంతం మొత్తం కూడా నీటితో నిండిపోయింది. డిపాచెస్, అలాగే అరైవల్ ప్రాంతాల్లోకి కూడా నీరు చేరిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అలాగే రన్ వేపై నిలిపి ఉంచిన ఎయిర్ క్రాప్ట్ వద్దకు కూడా వర్షపు నీరు పూర్తిగా చేరడంతో విమాన రాకపోకలకు కొంత ఆలస్యం అవుతుంది. విస్తారా, ఎయిర్ ఇండియా సహా ఇండిగో, స్పైస్ జెట్ వంటి విమానాల ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. వర్షం కారణంగా ఆలస్యంగా విమానాలు నడుపుతున్నట్లు ఆయా విమానయాన సంస్థలు ప్రకటించాయి.

Delhi : ఢిల్లీలో దంచి కొట్టిన వర్షాలు..18 ఏళ్ల తర్వాత

ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షపాత నమోదు అయింది. 46 ఏళ్లల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. కొన్ని గంటల వ్యవధిలోనే 11.5 శాతం వర్షపాతం నమోదు అయింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, ఎయిర్ పోర్టు, నది పరీవాహక ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.

ఢిల్లీని రుతుపవనాలు ఆలస్యంగా తాకాయి. ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతవరణ శాఖ ఢిల్లీకి అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలతో దేశ రాజధానిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.