Heavy Rains
Heavy Rain : ఉత్తరప్రదేశ్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాల్లోని రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇక వర్షం దాటికి సీతాపూర్ లో గోడకూలి ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరిపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఇక సీతాపూర్‌లోని మన్పూర్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని లక్ష్మణ్‌నగర్‌లో బుధవారం తెల్లవారు జామున ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. సదర్‌పూర్‌లో దంపతులు నిద్రిస్తున్న సమయంలో వారిపై ఇంటిగోడ కూలగా.. ఇద్దరు మృత్యువాతపడ్డారు. బిలోలి గ్రామంలో గోడ కూలిన ఘటనలో మరో వ్యక్తి మరణించాడు.
వర్షం కారణంగా మృతి చెందిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.