Heavy security : పార్లమెంట్ వద్ద భారీ భద్రత, ఎంపీల సస్పెన్షన్‌పై గందరగోళం

పార్లమెంట్ లోపల భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో శుక్రవారం నాడు లోక్ సభ వద్ద భారీ భద్రత కల్పించారు. ఇద్దరు యువకులు లోక్ సభ ఛాంబరులోకి దూకి పొగ డబ్బాలను కాల్చిన గటన తర్వాత డిల్లీ పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. శుక్రవారం పార్లమెంటు వద్ద సాయుధ భద్రతా బలగాలను మోహరించారు....

Heavy security at Parliament

Heavy security : పార్లమెంట్ లోపల భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో శుక్రవారం నాడు లోక్ సభ వద్ద భారీ భద్రత కల్పించారు. ఇద్దరు యువకులు లోక్ సభ ఛాంబరులోకి దూకి పొగ డబ్బాలను కాల్చిన గటన తర్వాత డిల్లీ పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. శుక్రవారం పార్లమెంటు వద్ద సాయుధ భద్రతా బలగాలను మోహరించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం పార్లమెంటు భవనం గేట్ల వద్ద పొడవాటి క్యూలు కనిపించాయి.

ALSO READ : పార్లమెంటులో భద్రత ఉల్లంఘన కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్

భద్రతా ఉల్లంఘన సంఘటన జరిగిన దాదాపు రెండు రోజుల తర్వాత భద్రతా సిబ్బంది సందర్శకుల గుర్తింపు కార్డులు, బ్యాగులను తనిఖీ చేయడం కనిపించింది. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనపై రాజ్యసభకు చెందిన ఒకరితో సహా 14 మంది ప్రతిపక్ష ఎంపీలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు సస్పెండ్ అయ్యారు.పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో కీలక నిందితుడు లలిత్ మోహన్ ఝాను అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు.

ALSO READ : తెలంగాణాను వణికిస్తున్న చలి…మూడు రోజులు జాగ్రత్త

నలుగురు నిందితులపై కఠిన ఉపా కింద తీవ్రవాద అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 8 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభించామని, ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని ప్రభుత్వం తన వంతుగా కేంద్రం విపక్షాలను కోరింది. కేంద్ర మంత్రి దన్వే రావుసాహెబ్ దాదారావు రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ పనితీరు ప్రకటన చేయనున్నారు.