Parliament security breach : పార్లమెంటులో భద్రత ఉల్లంఘన కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్

పార్లమెంటులో భద్రత ఉల్లంఘన కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝాను ఢిల్లీ పోలీసులు గురువారం అర్దరాత్రి అరెస్ట్ చేశారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కుట్ర కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ మోహన్ ఝా గురువారం రాత్రి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన తర్వాత ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు....

Parliament security breach : పార్లమెంటులో భద్రత ఉల్లంఘన కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్

Police arrested Lalit Jha

Updated On : December 15, 2023 / 12:03 PM IST

Parliament security breach : పార్లమెంటులో భద్రత ఉల్లంఘన కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝాను ఢిల్లీ పోలీసులు గురువారం అర్దరాత్రి అరెస్ట్ చేశారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కుట్ర కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ మోహన్ ఝా గురువారం రాత్రి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన తర్వాత ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.లలిత్ మోహన్ ఝా కోల్‌కతా నివాసి అని, అతను వృత్తి రీత్యా ఉపాధ్యాయుడని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఈ ఘటనను వీడియో తీసి లలిత్ ఝా అక్కడి నుంచి పారిపోయాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ALSO READ : Telangana : తెలంగాణాను వణికిస్తున్న చలి…మూడు రోజులు జాగ్రత్త

భద్రతా ఉల్లంఘన కేసులో సాగర్ శర్మ (26), మనోరంజన్ డి (34) బుధవారం మధ్యాహ్నం జీరో అవర్‌లో పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకి డబ్బాల నుంచి రంగు పొగను విడుదల చేశారు. అదే సమయంలో అమోల్ షిండే (25), నీలం దేవి (37) పార్లమెంట్ ఆవరణ వెలుపల నిరసన నినాదాలు చేస్తూ డబ్బాల నుంచి రంగు పొగను చల్లారు. పార్లమెంట్ ఘటన తర్వాత లలిత్ మోహన్ ఝా బస్సులో రాజస్థాన్‌లోని నాగౌర్ చేరుకున్నారు. అక్కడ అతను తన ఇద్దరు స్నేహితులను కలుసుకున్నాడు.

ALSO READ : Telangana Assembly : నేడు తెలంగాణ అసెంబ్లీ ఉభయసభల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇదే తొలి ప్రసంగం

రాత్రి ఒక హోటల్‌లో గడిపిన ఝా పోలీసులు తన కోసం వెతుకుతున్నారని గ్రహించాడు. బస్సులో తిరిగి ఢిల్లీకి రావాలని నిర్ణయించుకున్నట్లు ఢిల్లీ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భద్రతా ఉల్లంఘన సంఘటన జరిగిన వెంటనే ఝా నీలం,అమోల్ నినాదాలు చేస్తూ పార్లమెంటు భవనం వెలుపల ఉన్న డబ్బాల నుంచి పసుపు రంగు పొగను విడుదల చేస్తూ వీడియోను రికార్డ్ చేసి సూత్రధారికి పంపినట్లు పోలీసులు తెలిపారు.

ALSO READ : Gold Price Today : బంగారం, వెండి ప్రియుల‌కు బిగ్‌షాక్‌.. ఒక్క‌రోజే రూ.2500 పెరిగింది.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధ‌ర ఎంతంటే?

ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు గురువారం పార్లమెంటు భద్రతా ఉల్లంఘన వ్యవహారానికి సంబంధించి అరెస్టయిన మిగిలిన నలుగురు నిందితులకు ఏడు రోజుల కస్టోడియల్ రిమాండ్‌ను మంజూరు చేసింది.ఢిల్లీ పోలీసులు నలుగురు తీవ్రవాద చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.ఇది పక్కా ప్రణాళికతో పార్లమెంటుపై జరిగిన దాడి అని ఢిల్లీ పోలీసులు తెలిపారు.