Gold Price Today : బంగారం, వెండి ప్రియుల‌కు బిగ్‌షాక్‌.. ఒక్క‌రోజే రూ.2500 పెరిగింది.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధ‌ర ఎంతంటే?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold Price Today : బంగారం, వెండి ప్రియుల‌కు బిగ్‌షాక్‌.. ఒక్క‌రోజే రూ.2500 పెరిగింది.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధ‌ర ఎంతంటే?

Gold

Updated On : December 15, 2023 / 7:35 AM IST

Today Gold and Silver Rate: బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మీరు సిద్ధమవుతున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై 1,090 పెరిగింది. వరుసగా నాలుగు రోజులు బంగారం ధరలు తగ్గుకుంటూ వచ్చాయి. తాజాగా బంగారం ధర భారీగా పెరిగింది. మరోవైపు గత పదిరోజులుగా తగ్గుకుంటూ వచ్చిన వెండి ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 2500 పెరిగింది. అంతర్జాతీయ బంగారం ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగించడం ప్రభావం ఎంపీఎక్స్ బులియన్ మార్కెట్ పై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.

Gold

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధర..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,650కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 62,890 కి చేరింది.

Gold price

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,040.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,890కు చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారంపై రూ. 1200 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 1310 పెరిగింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,200 కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.63,490 కు చేరింది.

Gold price

భారీగా పెరిగిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో శుక్రవారం వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 2500 పెరిగింది. గత పదిరోజులుగా వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 79,500కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 79,500. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.77,500కు చేరింది. బెంగళూరులో కిలో వెండి రూ.76,000 వద్ద కొనసాగుతోంది.