Telangana Assembly : నేడు తెలంగాణ అసెంబ్లీ ఉభయసభల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇదే తొలి ప్రసంగం
గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.

Governor Speech
Telangana Assembly Governor Speech : తెలంగాణలోని వాస్తవ పరిస్థితులు పరిస్థితులు ప్రతిబింబించేలా ఇవాళ గవర్నర్ ప్రసంగం ఉండాలని క్యాబినెట్ నిర్ణయించింది. నేడు అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. నిన్న అసెంబ్లీ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం భేటీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపారు. సుమారు గంటపాటు జరిగిన క్యాబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎంతోపాటు మంత్రులు హాజరు అయ్యారు.
గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చాల్సిన అంశాలు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇదే గవర్నర్ తొలి ప్రసంగం. దీంతో ప్రభుత్వ ఆలోచన విధానాన్ని ఈ ప్రసంగం ద్వారా ప్రజలకు చేరే అవకాశం ఉందవని తెలుస్తోంది.
AP Cabinet : సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ.. పింఛన్ పెంపుతోపాటు కీలక అంశాలపై చర్చ
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీలను ప్రకటించిన నేపథ్యంలో వీటి అమలుపై ప్రభుత్వ కార్యచరణ సిద్ధం చేశారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా శాఖల పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది.
అలాగే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే అసలు విషయాలను ప్రజల ముందు ఉంచేలా ప్రణాళికలు రచిస్తోంది.
Telangana : తెలంగాణాను వణికిస్తున్న చలి…మూడు రోజులు జాగ్రత్త
ఈ మేరకు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని గవర్నర్ తమిళిసై యధావిధిగా చదువుతారా? లేక ఏమైనా మార్పులు చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది.
సంప్రదాయం ప్రకారం క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగాన్ని గవర్నర్ చదవడం ఆనవాయితీ. కానీ, గతంలో కేసీఆర్ ప్రభుత్వంతో గవర్నర్ తమిళిసైకి విబేధాలు కొనసాగడంతో నాటి ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగానికి మార్పులు చేసిన సందర్భాలున్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో గవర్నర్ తమిళిసై తొలి ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది.