AP Cabinet : సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ.. పింఛన్ పెంపుతోపాటు కీలక అంశాలపై చర్చ
ఎమ్యెల్యే, ఎంపీ అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, మంత్రులకు సైతం స్థాన చలనం, మరికొందరు మంత్రులకు, ఎమ్యెల్యేలకు స్థాన చలనం చేసే అంశంపై మంత్రులతో సిఎం జగన్ చర్చించనున్నారు.

ap cabinet
AP Cabinet Meeting : నేడు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియేట్ లో సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగనుంది. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మిచాంగ్ తుఫాను చేసిన నష్టం, ప్రభుత్వం నుండి చేసిన సాయం, పంట నష్టంపై క్యాబినెట్ చర్చించనుంది. మిచాంగ్ తుఫాన్ బాధితులకు చెల్లించాల్సిన నష్ట పరిహారం, మౌళిక వసతుల కల్పనపై క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోనుంది.
ప్రతి నెల ఇచ్చే సామాజిక పింఛన్ 2,750 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెంచేందుకు క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది. పింఛన్ 3,000 రూపాయలు ఇస్తామన్న జగన్ హామీ జనవరి 1వ తేది నుండి అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చే బైజూస్ ట్యాబ్ లు అందజేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలుపనుంది.
ఎమ్యెల్యే, ఎంపీ అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు, మంత్రులకు సైతం స్థాన చలనం, మరికొందరు మంత్రులకు, ఎమ్యెల్యేలకు స్థాన చలనం చేసే అంశంపై మంత్రులతో సిఎం జగన్ చర్చించనున్నారు. చంద్రబాబుపై నమోదు చేసిన కేసులు, తదనంతర పరిణామాలు, టీడీపీ – జనసేన పొత్తు.. పొత్తుల్లో వారు పోటీ చేసే నియోజకవర్గాలు, ఈక్వేషన్ లపై మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు.