రోజు పలు ప్రమాదాలు జరుగుతునే ఉంటాయి. ఈ క్రమంలో ఓ హెలీకాప్టర్ కూలిపోయింది. మరో ప్రాంతంలో ఓ మిలటరీ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ రెండు ప్రమాదాలు వేరు వేరు ప్రాంతాల్లో జరిగాయి. ఉత్తరాఖండ్ లో హెలీకాప్టర్ కూలిపోగా సిమ్లాలో మిలటరీ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదాల్లో ఒక ఆర్మీ జవాన్ మృతి చెందగా మొత్తం ఐదుగురికి గాయాలయ్యాయి.
ఉత్తరాఖండ్‌లో ఇవాళ ఓ హెలికాప్టర్ కూలిపోయింది. సహాయక సామాగ్రి మోసుకువెళ్తున్న ఆ హెలికాప్టర్ టికోచి ఏరియాలో నేలకూలింది. ప్రమాద సమయంలో చాపర్ లో ఉన్న పైలట్‌తో సహా కోపైలట్ స్వల్ప గాయాలకు గురయ్యారు. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా సమీపంలో మిలిటరీ వాహనం ఒకటి రోడ్డుపై స్కిడ్ అయ్యింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాను మృతిచెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాలు నుంచి లంబీదార్ మధ్య ఈ ప్రమాదం జరిగింది.
Himachal Pradesh: One Army personnel lost his life and three others were injured after the vehicle they were travelling in skidded off the road between Galu and Lambhidaar in Theog, Shimla. Injured have been admitted to hospital. pic.twitter.com/F5AjRPX0RV
— ANI (@ANI) August 23, 2019
#UPDATE Uttarakhand: A relief helicopter crashed in Tikochi area near cloud burst hit Arakot, today. People on board including Pilot and Co-pilot have sustained minor injuries. pic.twitter.com/sGtwKOiFIs
— ANI (@ANI) August 23, 2019