మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టుల దాడిలో అమరులైన 15 మంది జవాన్ల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంది. గడ్చిరోలి ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.
బుధవారం(మే-1,2019) గడ్చిరోలీ జిల్లాలో భద్రతా సిబ్బందితో వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు తీవ్రతకు వాహనం తునాతునకలైంది. కురికెడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు అనంతరం నక్సల్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారు.
Also Read : Cyclone Warning : ఉత్తరాంధ్రపై ఫోని పడగ