రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు..పోటీ ఎవరైనా చేయవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ రాజకీయాల్లోకి రావడం వేరు..
ఢిల్లీ : రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు..పోటీ ఎవరైనా చేయవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ రాజకీయాల్లోకి రావడం వేరు.. ప్రత్యర్థిని ఢీకొట్టి నిలబడి..వారిని ఓడించటం ప్రతీ రాజకీయవేత్తకు ఉండాల్సిన లక్షణం. అటువంటివారే రాజకీయాల్లో మనుగడ సాగించగలరు. ప్రముఖ నాయకుడి వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఓ మహిళ లోక్‌సభ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఆమే బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్. రాజకీయాల్లో పెద్ద పెద్ద ఉద్దండులకే సాధ్యం కాని మెజార్టీ చరిత్ర ఆమెది.లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ రికార్డు సాధించిన వ్యక్తి ఓ మహిళ కావటం విశేషం కావటం గమనించాల్సిన విషయం.
2014 ఎన్నికల్లో మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎంపీ గోపీనాథ్ ముండే మోదీ కేబినెట్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ 10 రోజులు కూడా పూర్తవ్వకముందే రోడ్డుప్రమాదంలో మరణించారు. ఆయన మృతితో ఖాళీ అయిన బీడ్ నియోజకవర్గంలో ఉపఎన్నికల్లో ముండే వారసురాలిగా కుమార్తె ప్రీతమ్ పోటీ చేసి ఏకంగా 6,96,321 మెజార్టీలో విజయంసాధించారు. 2004 ఎన్నికల్లో వెస్ట్ బెంగాలోని ఆరామ్‌బాగ్ నుంచి పోటీ చేసిన అనిల్ బసు 5,92,502 ఆధిక్యంతో గెలుపొందగా..పది సంవత్సరాల తరువాత అనిల్ బసు రికార్డును ప్రీతమ్ తిరగరాశారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 5.80లక్షలు, నంద్యాల, 1991), నరేంద్రమోదీ(5.70లక్షలు, వడోదర, 2014), వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(5.45లక్షలు,కడప,2011ఉపఎన్నికలు) మెజార్టీ సాధించినవారిలో ఉన్నారు. వీరందరినీ మించిన 6,96,321 మెజార్టీ సాధించారు ప్రీతమ్.