హిమాచల్​ప్రదేశ్​ సీఎంకు కరోనా

HIMACHAL PRADESH CM TESTS CORONA POSITIVE హిమాచల్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్​కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీఎం జైరాం ఠాకూరే స్వయంగా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వెల్లడించారు.



ఇటీవల కరోనా పాజిటివ్‌ వ్యక్తితో సమావేశమయ్యానని పేర్కొంటూ.. గతవారం నుంచే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. అనంతరం లక్షణాలు కనపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు..పరీక్షల్లో పాజిటివ్ గా తేలినట్లు జైరాం ఠాకూర్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17 వేలు దాటగా ఇప్పటి వరకు 248 మంది మరణించారు.