కలియుగ పాంచాలి : ఐదుగురు అన్నదమ్ములకు ఒకే భార్య..!!

Himachal pradesh common wife Tradition : ఐదుగురు అన్నదమ్ములకు ఒకే భార్య అనగానే మనకు గుర్తుకొచ్చేది మహాభారతం. ఇది పురాణమా? నిజంగా జరిగిందా? అనే విషయం పక్కనపెడితే..ఐదుగురు అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్న ద్రౌపదిని పాంచాలి అంటాం. అంటే ఐదుగురికి ఒకే భార్య అని అర్థం. ఇటువంటివి కేవలం పురాణాలకే పరిమితం కాదు..ప్రస్తుత ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఉంది.
ఒక భర్తకు ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటే అది పెద్ద విశేషం కాదు. కానీ ఒకే భార్యకు ఐదుగురు భర్త అంటే మాత్రం అది వింత అనే చెప్పాలి. అటువంటిది సంప్రదాయం మన భారతదేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి సంప్రదాయం ఈనాటికి కొనసాగుతోంది.
ఏంటీ ఒక భార్యకు ఐదుగురు భర్తలా? అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజం.ఐదుగురు అన్నదమ్ములందరూ కలిసి ఒకే మహిళను వివాహం చేసుకుని ఆమెతోనే సంసారం చేస్తున్నారు. ఒకే మహిళను ముగ్గురు నలుగురు సోదరులు పెళ్లి చేసుకోవడం కొన్ని హిమాచల్ తెగల ఆచారం.
ప్రధానంగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవించే ఈ తెగలు ఉమ్మడి వ్యవసాయం చేయటమే కాదు ఉమ్మడి భార్యలకు కూడా కొనసాగిస్తుంటారు. అన్నదమ్ములు వేర్వేరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే వేరు కాపురాలు పెట్టుకుంటే సమస్యలు వస్తాయని..వ్యవసాయంపై వచ్చే ఆదాయంపై విభేదాలు వస్తాయని వారి భయం. అందుకే అన్నదమ్ములంతా ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు.
కలిసి మెలిసి వ్యవయసాయం చేసుకుంటారు. కష్టాలు, నష్టాలు, సుఖాలు సంతోషాలు కలిసే పంచుకుంటారు. కుటుంబ పోషణ, ఆస్తుల పంపకాల్లో గొడవలు వస్తాయని ఆందోళనతో ఇలా దీన్ని సంప్రదాయంగా చేసుకుని కొనసాగిస్తున్నారు. ఆస్తి విషయంలో సమస్యలకు పరిష్కారంగా అన్నదమ్ముళ్లు ఒక మహిళనే పెళ్లి చేసుకుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని తాము ఇంకా కొనసాగిస్తున్నామని సదరు అలా చేసుకున్న అన్నదమ్ముల్ని కలియుగ పాండవులు అంటున్నారు. ఆ మహిళను కలియుగ పాంచాలి అని అనుకోవాలి.
ఇలాంటి వింత ఆచారాలు మన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఒకరి భార్యను మరొకరికి అప్పుగా ఇస్తారు. మరో దేశంలో భార్యలను ఒకరికొరు మార్చుకుంటుంటారు. ఇలాంటివి భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి కూడా.