Yati Narsinghanand : హిందూసేన మహాపంచాయత్ యతి నర్సింగానంద్ విద్వేష ప్రసంగాన్ని అడ్డుకున్న పోలీసులు

గత నెలలో హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసకు నిరసనగా ఆదివారం న్యూఢిల్లీలో హిందూ సేన మహాపంచాయత్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ద్వేషపూరిత ప్రసంగం చేయడంతో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మహాపంచాయత్‌ను పోలీసులు నిలిపివేశారు....

Yati Narsinghanand

Yati Narsinghanand : గత నెలలో హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసకు నిరసనగా ఆదివారం న్యూఢిల్లీలో హిందూ సేన మహాపంచాయత్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ద్వేషపూరిత ప్రసంగం చేయడంతో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మహాపంచాయత్‌ను పోలీసులు నిలిపివేశారు.వివాదాస్పద మత నాయకుడు యతి నర్సింహానంద్ 50 మంది మద్ధతుదారులతో కలిసి ఆదివారం హిందూ సేన మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు జంతర్ మంతర్ చేరుకున్నారు.

Chandrayaan-3 : చంద్రయాన్ 3 ల్యాండింగ్‌కు ముందు ఇస్రో విడుదల చేసిన చంద్రుడి తాజా చిత్రాలు

‘‘నేను హిందువులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను: ముస్లిం జనాభా పెరుగుతున్నప్పుడు మీ జనాభా తగ్గుతూ ఉంటే, ఈ దేశంలో వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన అదే మళ్లీ జరుగుతుంది’’ అని నర్సింహానంద్ సభలో చెప్పారు. ఢిల్లీ పోలీసులు త్వరితగతిన చర్యలు చేపట్టి గుంపును చెదరగొట్టడంతో వివాదాస్పద విద్వేష ప్రసంగాన్ని నిలిపివేయించారు. (Hindu Sena Mahapanchayat in Delhi stopped) ఢిల్లీ పోలీసులు ఈ విద్వేష వీడియో ప్రసంగంపై విచారణ జరుపుతున్నారు.

Chandrayaan 3 : అంతరిక్ష నౌక ల్యాండింగ్‌ అతి పెద్ద సవాలు… అంతరిక్ష వ్యూహకర్త పి కె ఘోష్ వ్యాఖ్యలు

ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. యతి నర్సింహానంద సరస్వతిపై గతంలోనూ పోలీసులు కేసులు పెట్టారు. (Yati Narsinghanand hate speech) ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల గతంలో కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. గన్‌పౌడర్ ఉపయోగించి మదర్సాలు, అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీని కూల్చివేయాలని యతి నర్సింహానంద కోరడంతో గతంలో ఆయనపై కేసు నమోదైంది. జాతిపిత మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై కేసు నమోదైంది.