Chandrayaan 3 : అంతరిక్ష నౌక ల్యాండింగ్‌ అతి పెద్ద సవాలు… అంతరిక్ష వ్యూహకర్త పి కె ఘోష్ వ్యాఖ్యలు

అంతరిక్ష నౌక చంద్రయాన్ 3 ల్యాండింగ్ అతిపెద్ద సవాలు అని అంతరిక్ష వ్యూహకర్త పి కె ఘోష్ చెప్పారు. అంతరిక్ష నౌకను అడ్డం నుంచి నిలువుగా ఉంచడం అనేది అతి పెద్ద సవాలు అని పీకే ఘోష్ పేర్కొన్నారు....

Chandrayaan 3 : అంతరిక్ష నౌక ల్యాండింగ్‌ అతి పెద్ద సవాలు… అంతరిక్ష వ్యూహకర్త పి కె ఘోష్ వ్యాఖ్యలు

Chandrayaan 3

Chandrayaan 3 : అంతరిక్ష నౌక చంద్రయాన్ 3 ల్యాండింగ్ అతిపెద్ద సవాలు అని అంతరిక్ష వ్యూహకర్త పి కె ఘోష్ చెప్పారు. అంతరిక్ష నౌకను అడ్డం నుంచి నిలువుగా ఉంచడం అనేది అతి పెద్ద సవాలు అని పీకే ఘోష్ పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆగస్టు 23వతేదీ ఆదివారం చంద్రయాన్-3ని చంద్రునిపై ల్యాండింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. (Expert shares biggest challenge during landing of spacecraft)  జాబిలి దక్షిణ ధ్రువాన్ని చేరుకునేందుకు రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌ సురక్షితంగా ల్యాండ్ కాలేకపోయింది. జాబిలికి కాసింత దూరంలోనే అది కుప్పకూలిపోయిన నేపథ్యంలో చంద్రయాన్ 3 ల్యాండింగ్  సవాలు లాంటిదని అంతరిక్ష వ్యూహకర్త పీకే ఘోష్ చెప్పారు.

Pulwama Encounter : పుల్వామాలో ఉగ్రవాదులతో మళ్లీ ఎన్‌కౌంటర్

అంతరిక్ష నౌకను క్షితిజ సమాంతర స్థానం నుంచి నిలువు స్థానానికి తీసుకురావడం కష్టం అని, ఈ అంశాలన్నింటినీ పరిశీలించాలని పీకే ఘోష్ చెప్పారు. డీబూస్టింగ్ లేదా రెట్రో ఫైరింగ్ అనేది వ్యోమనౌక వేగాన్ని తగ్గించడానికి ఒక ప్రక్రియ అని, అది గంటకు 6వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తోందని ఆయన తెలిపారు. చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకను (Chandrayaan 3) వృత్తాకార కక్ష్యలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ప్రక్రియ ముఖ్యమని ఆయన వివరించారు.