CAA వివాదం : ప్రైవేటు భాగాల్లో కొట్టారు – జామియా స్టూడెంట్స్

  • Publish Date - February 10, 2020 / 10:16 PM IST

చెప్పరాని చోట, తాకరాని ప్లేస్‌లలో పోలీసులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ మహిళా విద్యార్థులు ఆరోపిస్తుండడడం సంచలనం సృష్టిస్తోంది. తమ ప్రైవేటు భాగాల్లో గాయాలయ్యాయని, కొంతమందికి అంతర్గతంగా గాయాలైనట్లు వెల్లడిస్తుండడం కలకలం సృష్టిస్తోంది. CAAకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్‌కు కవాతు జరిపారు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు.

అయితే..పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. పలువురు విద్యార్థినీ, విద్యార్థులు గాయాలపాలయ్యారు. వీరిలో 10 మంది జామియా హెల్త్ సెంటర్‌లో చికిత్స నిమిత్తం చేరారు. అయితే..కొంతమంది విద్యార్థులను అల్ షిఫా ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు ఓ జాతీయ వార్తా సంస్థకు వెల్లడించారు.

పది మందికి పైగా మహిళా విద్యార్థినిల ప్రైవేటు భాగాలు దెబ్బతినడం జరిగిందని, అంతర్గతంగా గాయాలైనట్లు గుర్తించడం జరిగిందని వైద్యులు వెల్లడించారు. లాఠీలతో బాదడం వల్ల ఇలా జరిగిందని తెలిపారు. మగ విద్యార్థుల ప్రైవేటు భాగాలు దెబ్బతిన్నాయని, ఇద్దరిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించడం జరిగిందన్నారు. 

బుర్ఖాను తీసివేసి..మరి..ప్రైవేటు భాగాల్లో లాఠీలతో కొట్టాడని, బూట్లతో తన్నారని ఓ విద్యార్థిని ఆరోపించారు. కెమెరాకు చిక్కకుండా ఉండేందుకు బెల్ట్ కింద కొట్టారని మరో విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది. తొక్కిసలాటలో తామంతా చిక్కుకపోవడం జరిగిందని, సున్నితమైన భాగాల్లో గాయాలయ్యాయని తెలిపారు. 

విద్యార్థినీలను కొడుతుండగా తాను అడ్డుకోవడం జరిగిందని, తనను కూడా లాఠీలతో బాదారని మగ విద్యార్థి తెలిపారు. ఛాతి, వెనుక భాగం, ప్రైవేటు భాగంలో కొటారని, ఎమర్జెన్సీ వార్డులో ఉంచడం జరిగిందన్నారు. 

జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు CAAని వ్యతిరేకిస్తూ..పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించారు. 
అయితే..పోలీసులు వారిని బారికేడ్ల సహాయంతో అడ్డుకున్నారు. 
ఈ క్రమంలో..విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వదం, తోపులాట చోటు చేసుకుంది. 
పోలీసులు లాఠీలకు పని చెప్పారు. 
మహిళలను అని చూడకుండా ప్రైవేటు ప్లేస్‌లలో కొట్టారని విద్యార్థినీలు ఆరోపిస్తుండడం సంచలనం సృష్టిస్తోంది.