viral video : పాములతో వ్యక్తి చలగాటం.. వణుకు పుట్టించిన వీడియో

పాముల్ని చూడగానే భయపడిపోతాం. అలాంటిది వాటిని పట్టుకునే వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదకరమే. పాములను పడుతున్న ఓ వ్యక్తి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

viral video

viral video : పాములు ఎంత ప్రమాదకరమైవో తెలిసిందే.. వందల పాములు పట్టిన వారిలో చాలామంది పాము కాటుకి బలైన సంఘటనలు చదివాం.. చూసాం. తాజాగా ఇంటర్నెట్లో ఓ వ్యక్తి పాములను పడుతున్న వీడియో వైరల్ అవుతోంది. చూసేవారిని వణుకు పుట్టించింది.

Snake Found In Sambar : భోజనం చేస్తుండగా సాంబర్ లో కనిపించిన పాము.. ఈసీఐఎల్ క్యాంటీన్ లో ఘటన
పాములు అంటే భయం ఉన్నప్పటికీ వాటిని పెంపుడు జంతువుల్లా పెంచుకునే వ్యక్తులు ఉన్నారు. హెర్పిటో కల్చర్ అని పిలువబడే ఈ అభిరుచి కొంతమందిలో ఉంటుంది. అందుకోసం వాటిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. వాటి ప్రవర్తన, లక్షణాలు చూసి వారు సంతోష పడుతుంటాచు. వాటితో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. snakeyuvaerode అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నెటిజన్లను వణుకు పుట్టించింది. తను చేపట్టిన మొదటి రెస్క్యూ అని విష్ చేయమని అతను పోస్ట్‌లో నెటిజన్లను రిక్వెస్ట్ చేసాడు.

Snakes : పాములు అంతరించిపోవటం వల్ల .. ఆడబిడ్డలకు వివాహాలు కావటంలేదట

వీడియోలో వ్యక్తి ఎంతో సాహసంతో వాటిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అవి అతనిపై దూకుడు చూపడం భయాన్ని కలిగించింది. వాటిలో ఒకటి అతని ముఖంపై కాటు వేయడానికి ప్రయత్నించింది. అదృష్టవశాత్తూ అతనికేమీ కాలేదు. చూడటానికి చాలా భయానకంగా ఉందని.. ఇలాంటి ఫీట్లు చేయవద్దని అతనికి నెటిజన్లు సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.