How Noida man almost missed evacuation deadline
#TwinTowers: దేశంలో ఈరోజు చర్చంతా నోయిడాలో కూలిన ట్విన్ టవర్స్ గురించే. ట్విన్ టవర్స్ కూల్చేందుకు ముహూర్తం ఖారారు చేసి.. సమీపంలోని ఉన్నవారందిరీ ఖాళీ చేయించారు. ఆ చుట్టుపక్కల నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. అయితే ట్విన్ టవర్‌కు సమీపంలో ఉన్న ఒక వ్యక్తి మాత్రం ప్లాటు ఖాళీ చేయకుండా ఆదమర్చి నిద్రపోయాడు.
ఖాళీ చేయాల్సిన నిర్ణీత సమయానికి అతడు మేల్కోలేదు. జంట టవర్ల కూల్చివేత ముందు చివరిసారి అన్నిచోట్ల తనిఖీలు చేశారు. ఒక టవర్‌లోని పై అంతస్తు ఫ్లాట్‌లో నిద్రపోతున్న ఆ వ్యక్తిని సెక్యూరిటీ గార్డు గుర్తించాడు. వెంటనే టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో అతడ్ని నిద్ర లేపి అక్కడి నుంచి షెల్టర్‌కు పంపారు. కాగా కూల్చివేత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సకాలంలో ఆ వ్యక్తిని గుర్తించినట్లు టాస్క్‌ఫోర్స్ సభ్యుడు తెలిపారు.
PM Modi at Gujarat: గుజరాత్ పరువు తీసి పెట్టుబడులు ఆపేందుకు కుట్రలు
దాదాపు వెయ్యి కోట్ల ఖర్చుతో నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్స్.. ఆదివారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు 9 సెకన్లలో నేలమట్టమయ్యాయి. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమైన డిమోలిష్ ఆపరేషన్.. 30 నిమిషాల్లో పూర్తి చేసుకుంది. సెక్టార్ 93ఏలో ఉన్న ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. రెండు భవనాల్లో మొత్తం 7,000 రంధ్రాలు, 20,000 సర్క్యూట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి అంతస్తులో పేలుడు పదార్థాలను అమర్చి.. వాటర్ ఫాల్ టెక్నిక్ అనే పద్దతిలో భవనాలు నిలువుగా కింద పడేలాగా ప్లాన్ చేసి, పని పూర్తి చేశారు.
కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ ట్విన్ టవర్ కూల్చివేత దేశ చరిత్రలో నిలిచిపోనుంది. దేశంలో ఇప్పటి వరకు కూల్చిన అతిపెద్ద భవనంగా ఇది రికార్డుకు ఎక్కింది. కిలోమీటరు దూరంలో ఉండి బటన్ నొక్కగానే.. తొమ్మిదంటే తొమ్మిదే సెకన్లలో భవనం శిథిలాల్లో కలిసిపోయింది. కాగా, ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఉపయోగించిన పేలుడు పదార్థాలు మూడు అగ్ని-5 మిసైల్స్ లేదంటే 4 పృథ్వి మిసైల్స్ లేదంటే 12 బ్రహ్మోస్ మిసైల్స్‌తో సమానమని అంటున్నారు.