PM Modi at Gujarat: గుజరాత్ పరువు తీసి పెట్టుబడులు ఆపేందుకు కుట్రలు

గుజరాత్ పరువు తీయడమే కాకుండా రాష్ట్రానికి పెట్టబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అనేకం జరిగాయి. దేశం ముందు ప్రపంచం ముందు గుజరాత్ గురించి తప్పుడు ప్రచారం జరిగింది. కానీ రాష్ట్రం కొత్త మార్గాన్ని ఎంచుకుని ముందుకు కదిలింది. లక్ష్యాల్ని ముద్దాడింది. ఇప్పుడు దేశం గురించి కూడా అలాంటి ప్రచారమే జరుగుతోంది. కానీ మీరు ఇప్పటి నుంచే మీ మనోజ్ణానానికి పని చెప్పండి. 2047నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది

PM Modi at Gujarat: గుజరాత్ పరువు తీసి పెట్టుబడులు ఆపేందుకు కుట్రలు

There were conspiracies to defame Gujarat to stop investment says PM Modi

PM Modi at Gujarat: గుజరాత్ పరువు తీసి పెట్టుబడులు రాకుండా ఆపేందుకు అనేక కుట్రలు జరిగాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం తన సొంత రాష్ట్రంలో మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బుజ్ జిల్లాలో కొన్ని అభవృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.

‘‘2001లో కచ్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. కచ్‭ను తిరిగి అభివృద్ధి చేయాలని నేను పిలుపునిచ్చాను. మేము చాలా కష్టపడ్డాం. ఫలితం మీకు ఈరోజు కనిపిస్తూనే ఉంది. కానీ ఆ సమయంలో కచ్ మళ్లీ పాత స్థితికి రాదని చాలా మంది మమ్మల్ని అసంతృప్తికి గురి చేసే మాటలు అన్నారు. అవేవీ కచ్ ప్రజలు పట్టించుకోలేదు. భూకంపం అనంతరం పరిస్థితుల్ని మొత్తంగా మార్చేశారు’’ అని మోదీ అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘గుజరాత్ పరువు తీయడమే కాకుండా రాష్ట్రానికి పెట్టబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు అనేకం జరిగాయి. దేశం ముందు ప్రపంచం ముందు గుజరాత్ గురించి తప్పుడు ప్రచారం జరిగింది. కానీ రాష్ట్రం కొత్త మార్గాన్ని ఎంచుకుని ముందుకు కదిలింది. లక్ష్యాల్ని ముద్దాడింది. ఇప్పుడు దేశం గురించి కూడా అలాంటి ప్రచారమే జరుగుతోంది. కానీ మీరు ఇప్పటి నుంచే మీ మనోజ్ణానానికి పని చెప్పండి. 2047నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది’’ అని ప్రధాని అన్నారు.

Nitin Gadkari: వాడుకొని వదిలేయొద్దు: మోదీ-షా టార్గెట్‭గా గడ్కరీ వ్యాఖ్యలు?