Class 8 Textbook: జైలు నుంచి బుల్‭బుల్ పిట్టలపై సావర్కర్ సవారీ.. కొత్త వివాదానికి తెరలేపిన 8వ తరగతి పాఠ్యపుస్తకం

దీనిపై కర్ణాటక టెక్స్ట్ బుక్ సొసైటీ స్పందించింది. ఈ విషయమై తమకు కొన్ని ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. కాగా, విమర్శలకు కారణమైన వాక్యం కేవలం సాహిత్య అలంకారంలో రూపొందించిందని, దానికి ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని పాఠ్యపుస్తకం వెనుక ఉన్న వ్యక్తులు కొట్టిపారేస్తున్నారు.

Class 8 Textbook: జైలు నుంచి బుల్‭బుల్ పిట్టలపై సావర్కర్ సవారీ.. కొత్త వివాదానికి తెరలేపిన 8వ తరగతి పాఠ్యపుస్తకం

Objections Emerge to Section in Class 8 Kannada Textbook That Glorifies Savarkar

Class 8 Textbook: కన్నడ పాఠ్య పుస్తకాలు ఈ మధ్య తరుచూ వివాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఎనిమిదవ పాఠ్యపుస్తకంలో హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‭ను కీర్తిస్తూ రూపొందించిన పాఠం వివాదానికి తెరలేపింది. ఎనిమిదవ తరగతి సెకండ్ లాంగ్వేజ్‭లో కేటీ గట్టి రచించిన ‘అండమాన్‭కు ప్రయాణం’ అనే పాఠ్యాంశంలో అండమాన్ జైలులో ఉన్నప్పుడు సావర్కర్ బుల్‭బుల్ పిట్టలపై సవారీ చేస్తూ ప్రతిరోజూ మాతృభూమిని చూసి వచ్చేవారంటూ రాసుకొచ్చారు. సావర్కర్ జైలు జీవితం గురించి వివరించే క్రమంలో ఈ వాక్యం చేర్చారు.

బ్రిటిషర్లు నిర్మించిన ఆ జైలు నుంచి బయటికి వెళ్లే మార్గం లేదు. పైగా అండమాన్‭ నుంచి ఇక్కడి భూభాగానికి మధ్య వందల కిలోమీటర్ల సముద్రం ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే అండమాన్ జైలుకు ప్రతి రోజు బుల్‭బుల్ పిట్టలు రావడం, వాటిపై సావర్కర్ సవారీ చేస్తూ మాతృభూమిని సందర్శించేవారని రాసుకురావడం తీవ్ర దుమారానికి దారి తీసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ప్రకారమే విద్యార్థులను ఇలా పక్కదారి పట్టిస్తోందనేన విమర్శలు వస్తున్నాయి.

ఒక భావజాలాన్ని రెచ్చగొట్టడంలో భాగంగా పాఠ్య పుస్తకాల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తుల గురించి పాఠాలు రూపొందిస్తున్నారని, అభూత కల్పనలు విద్యార్థుల మెదళ్లలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే దీనిపై కర్ణాటక టెక్స్ట్ బుక్ సొసైటీ స్పందించింది. ఈ విషయమై తమకు కొన్ని ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. కాగా, విమర్శలకు కారణమైన వాక్యం కేవలం సాహిత్య అలంకారంలో రూపొందించిందని, దానికి ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని పాఠ్యపుస్తకం వెనుక ఉన్న వ్యక్తులు కొట్టిపారేస్తున్నారు.

#TwinTowers: ట్విన్ టవర్స్ వ్యవహారంలో ఇంత జరిగినా ఒక్కరూ జైలుకు వెళ్లలేదు