#TwinTowers: ట్విన్ టవర్స్ వ్యవహారంలో ఇంత జరిగినా ఒక్కరూ జైలుకు వెళ్లలేదు

భారత్‭లో కూలిన అతిపెద్ద భవనం ఇదే. సంవత్సరాల పాటు వందల మంది శ్రమించి, వేల కోట్లు వెచ్చించి నిర్మించిన నోయిడా ట్విన్ టవర్స్ నిర్మాణం కేవలం 9 సెకన్లలో నేలమట్టమైంది. ఇలాంటి పరిణామాలకు సుపర్‭టెక్ లాంటి రియల్లర్ కంపెనీలు, నోయిడా అథారిటీలు, ప్రభుత్వాలు సిగ్గుతో తలదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం రియల్ ఎస్టేట్ మాఫియాకు ఎంత దోహద పడుతోందో ఇదొక్క ఉదాహరణ చాలు

#TwinTowers: ట్విన్ టవర్స్ వ్యవహారంలో ఇంత జరిగినా ఒక్కరూ జైలుకు వెళ్లలేదు

no one in jail over noida twin tower construction case

#TwinTowers: దాదాపు వెయ్యి కోట్ల ఖర్చుతో నిర్మించిన నోయిడాలోని ట్విన్ టవర్స్.. ఆదివారం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు 9 సెకన్లలో నేలమట్టమయ్యాయి. మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమైన డిమోలిష్ ఆపరేషన్.. 30 నిమిషాల్లో పూర్తి చేసుకుంది. సెక్టార్ 93ఏలో ఉన్న ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించారు. రెండు భవనాల్లో మొత్తం 7,000 రంధ్రాలు, 20,000 సర్క్యూట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి అంతస్తులో పేలుడు పదార్థాలను అమర్చి.. వాటర్ ఫాల్ టెక్నిక్ అనే పద్దతిలో భవనాలు నిలువుగా కింద పడేలాగా ప్లాన్ చేసి, పని పూర్తి చేశారు.

భారత్‭లో కూలిన అతిపెద్ద భవనం ఇదే. సంవత్సరాల పాటు వందల మంది శ్రమించి, వేల కోట్లు వెచ్చించి నిర్మించిన నోయిడా ట్విన్ టవర్స్ నిర్మాణం కేవలం 9 సెకన్లలో నేలమట్టమైంది. ఇలాంటి పరిణామాలకు సుపర్‭టెక్ లాంటి రియల్లర్ కంపెనీలు, నోయిడా అథారిటీలు, ప్రభుత్వాలు సిగ్గుతో తలదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం రియల్ ఎస్టేట్ మాఫియాకు ఎంత దోహద పడుతోందో ఇదొక్క ఉదాహరణ చాలు. అయితే ఇంత జరిగినా ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ట్విన్ టవర్స్‌ నిర్మించిన సూపర్‌టెక్ కంపెనీ గానీ, నోయిడా అధారిటీలో అనుమతులు మంజూరు చేసిన అధికారులు గానీ, ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన బాధ్యులైన అధికారులు గానీ ఏ ఒక్కరూ జైలులో లేరు.

#TwinTowers: నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతలో 10 కీలక అంశాలు

నోయిడా అథారిటీలోని 26 మంది అధికారులను ఈ అక్రమ నిర్మాణానికి సహకరించిన వ్యక్తులగా ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది. నోయిడా ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ముగ్గురు అధికారులపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ప్రస్తుతం నోయిడా అథారిటీకి చెందిన 11 మంది అధికారులు నిఘా నీడలో ఉన్నారు. శాఖాపరమైన చర్యలే తప్ప వీళ్లలో ఏ ఒక్కరూ చేసిన నేరానికి జైలులో లేకపోవడం గమనార్హం. కాగా, ఈ వ్యవహరాంలో 11 మందిని సస్పెండ్ చేశారు.

1. ప్లానింగ్ మేనేజర్: ముఖేష్ గోయల్
2. ప్లానింగ్ అసిస్టెంట్: విమలా సింగ్
3. ఉత్తర్‌ప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్లానింగ్ అసిస్టెంట్: అనిత
4. యమునా అథారిటీ ప్లానింగ్ జనరల్ మేనేజర్: రీతూరాజ్
5. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ సీపీఏ: త్రిభువన్ సింగ్, దేవ్‌పురాజీ
6. సీనియర్ టౌన్ ప్లానర్: రాజ్‌పాల్ కౌషిక్
7. టౌన్ ప్లానర్: అశోక్ కుమార్ మిశ్రా
8. ప్రాజెక్ట్ ఇంజినీర్: బాబూ రామ్
9. గ్రూప్ హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ఏజీఎం: శైలేంద్ర కైరే
10. ఫైనాన్స్ కంట్రోలర్: ఏసీ సింగ్

Elon Musk: కొడుకు ప్రపంచ కుబేరుడు.. సరైన ఇల్లు లేక గ్యారేజ్‌లో నిద్రించిన తల్లి